IPL 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫ్రీగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ.. మీకు కావాలంటే ఇలా చేయండి
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 సమరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న ధనాధన్ క్రికెట్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు సమాయత్తమవుతున్నాయి.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 సమరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న ధనాధన్ క్రికెట్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు సమాయత్తమవుతున్నాయి. తమ జట్టు ఆటగాళ్లందరినీ ఒక చోటుకు చేర్చి ప్రాక్టీస్ చేయిస్తున్నాయి. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ఈక్రమంలో ఐపీఎల్ సమరం కోసం ఆసక్తితో ఎదురుచూస్తోన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదంటంటే రానున్న ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫ్రీగా జెర్సీలు పంచేందుకు సిద్ధమైంది. తద్వారా తమ టీమ్‌కు మరింత సపోర్ట్ పెంచవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండు ఐపీఎల్ టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఎస్‌ఆర్‌హెచ్ జెర్సీలను అందించనున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం.. మీకూ సన్‌రైజర్స్ జెర్సీ కావాలంటే వెంటనే రెండు ఐపీఎల్ టిక్కెట్లను బుక్ చేసుకోండి..
టికెట్లపై 25 శాతం డిస్కౌంట్.. కాగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హోం మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ల టికెట్లను ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. పేటీఎం ఇన్సైడర్ యాప్లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మొదటి 10 వేల టికెట్స్ను బుక్ చేసుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది.
SRH is giving a fan jersey for free for every two tickets bought by a fan.
Nice gesture by Sunrisers Hyderabad.
— Johns. (@CricCrazyJohns) March 13, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..