IND vs AUS: ఆరోగ్యం బాగో లేకున్నాసెంచరీతో అదరగొట్టాడు.. ఆయనే నాకు స్ఫూర్తి.. కోహ్లీపై అనుష్క ప్రశంసల జల్లు
ఈ మ్యాచ్‌లో ఎంతో ఓపికగా 364 బంతులు ఎదుర్కొని 186 పరుగులు చేశాడు. త్రుటిలో డబుల్ సెంచరీ కోల్పోయినా 1204 రోజుల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. దీంతో కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ భారీ సెంచరీతో చెలరేగాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 186 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఎంతో ఓపికగా 364 బంతులు ఎదుర్కొని 186 పరుగులు చేశాడు. త్రుటిలో డబుల్ సెంచరీ కోల్పోయినా 1204 రోజుల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. దీంతో కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. కాగా విరాట్ కోహ్లీకి సంబంధించి అతని సతీమణి ఒక ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే.. కోహ్లీకి ఆరోగ్యం బాగోలేదట. జ్వరంతో బాధపడుతున్నాడట. తన భర్త సెంచరీ చేసిన అనంతరం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది అనుష్క. ‘విరాట్ కోహ్లీ ఆరోగ్యం బాగా లేకపోయినా ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆయన నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటాడు’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది అనుష్క. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు క్రికెట్ పట్ల కోహ్లీ కున్న నిబద్ధతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. తద్వారా కీలకమైన 91 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. నాలుగో రోజు కోహ్లీతో పాటు అక్షర్ పటేల్ (79), శ్రీకర్ భరత్ (44) పరుగులతో రాణించారు. ఇక నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది ఆసీస్. మ్యాచ్ స్వరూపాన్ని చూస్తుంటే ఈ టెస్టు డ్రాగా ముగిసేలా ఉంది. అదే జరిగితే 2-1 తో బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ టీమిండియా సొంతమవుతుంది.
Instagram post by Anushka Sharma about King Kohli. pic.twitter.com/0CV7QK9rMD
— Johns. (@CricCrazyJohns) March 12, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..