AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2023: తారక్‌, రామ్‌చరణ్‌ కాదు.. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నది ఈ అందాల తారనే..

మరికొన్ని గంటల్లో జరగనున్న ఆస్కార్‌ అవార్డుల కోసం భారతదేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వేయికళ్లతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుంచి 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలవడమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Oscars 2023: తారక్‌, రామ్‌చరణ్‌ కాదు.. ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' పాటకు డ్యాన్స్‌ చేస్తున్నది ఈ అందాల తారనే..
Lauren Gottlieb
Basha Shek
|

Updated on: Mar 11, 2023 | 9:06 PM

Share

మరికొన్ని గంటల్లో జరగనున్న ఆస్కార్‌ అవార్డుల కోసం భారతదేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వేయికళ్లతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలవడమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ కూడా కొట్టేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈక్రమంలో మార్చి 12న జరిగే ఆస్కార్‌ వేడుకల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ ఈవెంట్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ మొత్తం లాస్‌ఏంజెలిస్‌ చేరుకుంది. నాటు నాటు సాంగ్‌ గురించి తమదైన శైలిలో ప్రమోషన్స్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. నాటు నాటు సాంగ్ పాటకు లైవ్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ ఇస్తారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాము ఎలాంటి డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ చేయడం లేదంటూ తారక్‌ చెప్పడంతో అభిమానులందరూ నిరుత్సాహపడ్డారు. అయితే తారక్‌, చెర్రీ లేకుండా ఆస్కార్‌ వేదికపై నాటు నాటు సాంగ్‌ లైవ్ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ ఉంటుంది. వారి స్థానంలో ప్రముఖ అమెరికన్‌ నటి లారెన్ గాట్లిబ్‌ నాటు నాటు సాంగ్‌ పాటకు స్టెప్పులేయనుంది. దీనికి సంబంధించి లారెన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

‘మార్చి 12న ఆస్కార్ స్టేజ్ పై నాటు నాటు సాంగ్ కి పెర్ఫమెన్స్‌ చేసేందుకు నేనెంతో ఉత్సాహంగా ఉన్నా’ అంటూ గాట్లిబ్‌ పోస్ట్ పెట్టింది. దీంతో ఒక్కసారి ఆర్ఆర్ఆర్ అభిమానుందరి దృష్టి ఈ అమెరికన్‌ అందాల తారవైపు మళ్లింది. ఇదిలా ఉంటే ఇండియన్ సినిమాలకు లారెన్ గాట్లిబ్ చాలా అనుబంధం ఉంది. పాపులర్‌ హిందీ డ్యాన్స్‌ షో ఝలక్ దిఖ్లా జా సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది లారెన్‌. ఇక 2013లో ABCD సినిమాలో నటించి తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు ఆస్కార్‌ వేదికపై భారతీయ సినిమాను రిప్రజెంట్‌ చేసే అవకాశం దక్కించుకుంది. ఈక్రమంలో లాస్ ఏంజిల్స్‌ లో ప్రసిద్ధ హాలీవుడ్ సింబల్ ముందు దిగిన తన ఫొటోను షేర్ చేస్తూ..’నేను ఆస్కార్స్‌ లో నాటు నాటుపై పెర్ఫామెన్స్‌ చేయబోతున్నాను. వరల్డ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై ఇండియాకి ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని మురిసిపోతోందీ అమెరికన్‌ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..