Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Yamuna: న్యాయస్థానంలో గెలిచాను.. కానీ వారు నేను చచ్చిపోయినా వదలరేమో.. నటి యమున ఆవేదన

నటిగా దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమున 2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. అయితే  ఈ వ్యవహారంలో యమున తప్పేమీ లేదంటూ.. కావాలనే ఇరికించారంటూ న్యాయస్థానంలో క్లీన్‌చీట్‌ లభించింది.

Actress Yamuna: న్యాయస్థానంలో గెలిచాను.. కానీ వారు నేను చచ్చిపోయినా వదలరేమో.. నటి యమున ఆవేదన
Actress Yamuna
Follow us
Basha Shek

|

Updated on: Mar 11, 2023 | 8:25 PM

తన అందం, అభినయంతో వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకుల మనసులు చూరగొంది ప్రముఖ నటి యమున. కర్ణాటకలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఆమె మౌన పోరాటం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్రమందారం, బంగారు కుటుంబం, బ్రహ్మచారి మొగుడు తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మళయాళ భాషల్లో సుమారు 50కు పైగా సినిమాల్లో నటించింది. ఇక విధి, అన్వేషిత వంటి ధారావాహికలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా నటిగా దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమున 2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది.  అయితే  ఈ వ్యవహారంలో యమున తప్పేమీ లేదంటూ.. కావాలనే ఇరికించారంటూ న్యాయస్థానంలో క్లీన్‌చీట్‌ లభించింది. దీని గురించి పలు సందర్భాల్లో, పలు వేదికల మీద చెప్పుఉకొచ్చింది. అయితే ఇప్పటికీ సోషల్‌ మీడియాలో తన మీద ఎన్నో అసభ్యకరమైన వార్తలు వస్తున్నాయంటోంది యమున. ఈ సంఘటనకు సంబంధించి చాలా దారుణమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది.

నేను మనిషినే కదా..

‘హాయ్ అండి.. నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా తెలియని ఓ బాధ అయితే నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అది కూడా సోషల్‌ మీడియా వల్ల. ఎందుకంటే నేను ఏళ్ల క్రితమే ఓ సమస్య నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటున్నాను. ఆ ప్రాబ్లమ్‌లో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది. న్యాయ పరంగా నేను విజయం సాధించాను. కానీ సోషల్ మీడియాను మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల థంబ్‌నెయిల్స్‌, వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు. నేను వాటికి సంబంధించిన వీడియోలను చూడను. వాటిల్లో ఏం ఉందో నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆ థంబ్‌నెయిల్స్‌ మాత్రం నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో నన్ను ఎంత నేను మోటివేట్ చేసుకున్నా.. కొన్ని సందర్భాల్లో మాత్రం తెగ బాధపడిపోతుంటాను. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా. ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఆ థంబ్‌నెయిల్స్‌ చూస్తే.. నేను చనిపోయినా కూడా నన్ను వీళ్లు వదలరు అనిపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది యమున. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. నెటిజన్లు ఆమెకు మద్దతునిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఎవరో పనికి మాలిన వెధవలు చేసిన పనికి మీరెందుకు బాధపడతారంటూ యమునకు సపోర్టుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి