TOP 9 ET News: ఆస్కార్ ముంగిట.. సారీ చెప్పిన యంగ్ టైగర్ | NTR: ఆ సినిమా చేయడం లేదు.

TOP 9 ET News: ఆస్కార్ ముంగిట.. సారీ చెప్పిన యంగ్ టైగర్ | NTR: ఆ సినిమా చేయడం లేదు.

Anil kumar poka

|

Updated on: Mar 11, 2023 | 8:19 PM

ఇటు మనల్ని.. అటు ఫారెనర్స్‌నీ..! మడతేసి.. ఇరగేసి.. ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపేస్తున్న నాటు నాటు సాంగ్‌ను.. ఆస్కార్ స్టేజ్‌పై లైవ్‌లో వినాలనుకుంటున్నారు కదూ! దాంతో పాటే.. మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ నాటు స్టెప్‌ వేస్తే..

01. Jr NTR clarifies Naatu Naatu performance On Oscar stage
ఆస్కార్ ముంగిట.. సారీ చెప్పిన యంగ్ టైగర్

ఇటు మనల్ని.. అటు ఫారెనర్స్‌నీ..! మడతేసి.. ఇరగేసి.. ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపేస్తున్న నాటు నాటు సాంగ్‌ను.. ఆస్కార్ స్టేజ్‌పై లైవ్‌లో వినాలనుకుంటున్నారు కదూ! దాంతో పాటే.. మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ నాటు స్టెప్‌ వేస్తే.. ఆస్కార్ సెర్మనీలో టాప్‌ లేచిపోయే అరుపులు వస్తాయని అనుకుంటున్నారు కదూ..! కానీ అలా అనుకోకండి! ఎందుకంటే తారక్ ఆ ఒక్కటీ అడగకండని ముందే అంటున్నారు కాబట్టి!

02. NTR Looks Viral in SM
హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా.. Jr NTR

నిన్నమొన్నటి వరకు సూటు బూటులో… బాబు హాలీవుడ్‌ బ్రాడ్‌ పిట్లా ఉన్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు చెర్రీ!!! ఇక ఇప్పుడు తారక్ కూడా తన టర్న్‌ వచ్చిందంటున్నారు. లేట్ అయినా… లేటెస్ట్ అవుట్‌ఫిట్లో దిగిపోయారు. యాజ్‌ ఇట్ ఈజ్‌ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నారు.

03.Tamma Reddy Bharadwaj Reacts His Controversial Comments About RRR
క్షమాపణలు చెప్పను.. తమ్మారెడ్డి షాకింగ్ వీడియో..!

అడుసు తొక్కనేలా కాలు కడగనేలా..! అనేది వాడకంలో ఉన్న సామెత! కానీ అడుసు తొక్కనే లేదు ఇక కాలు కడగాల్సిన అవసరమేంటి? ఇది తమ్మారెడ్డి భరద్వాజ మాట. ట్రిపుల్ ఆర్ విషయంలో ఆయన వల్ల వచ్చిన కాంట్రవర్శీ విషయంలో ఈయన ఇచ్చిన ఆన్సర్ ఇదేనట!

04.Thamma Reddy Strong Counter to Director Ragavendra Rao
దర్శకేంద్రుడికి ఇన్‌డైరెక్ట్ వార్నింగ్!

విమర్శకు ప్రతి విమర్శ..! ఏమవుతుంది! విమర్శే అవుతుంది కదా..! అలాగే కౌంటర్‌కు రివర్స్‌ కౌంటర్ ఏమవుతుంది! కౌంటరే అవుతుంది! ఇప్పుడు రాఘవేంద్ర రావు విషయంలోనూ అదే అయింది. తమ్మారెడ్డి మాటలకు దర్శకేంద్రుడు వేసిన కౌంటర్‌.. మళ్లీ తనపైకే రివర్స్‌ కౌంటర్‌లా వచ్చేసింది.

05.Director Vetrimaaran Gives Clarity on Jr NTR Film
NTR: ఆ సినిమా చేయడం లేదు..

ఎవరు అవునన్నా కాదన్నా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమేజింగ్ పర్ఫార్మరే! మరి ఇలాంటి పర్ఫార్మర్‌..! స్టార్ పర్ఫర్మర్‌..! కమర్షల్ క్యాలిబర్ భారీగా ఉన్న పర్ఫార్మర్..! వెట్రిమారన్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ చేతిలో పడితే ఎలా ఉంటుంది! ఫిల్మ్ హిస్టరీలోనే చిరస్థాయిగా నిలిచిపోయే ఓ సినిమా బయటికొచ్చేలా చేస్తుంది కదూ..!!! కానీ కాదు!!! ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్సే… లేదు!

06.Singer Rahul Siplighanj Changed his Getup Completely
కాక మొత్తం మారిపోయిండుగా…

గల్లీపోరడు.. గా ఆస్కార్ అవార్డు వరకు పోయిండు! తీర్మాన్.. దో మార్ అంటూ మాసు బట్టల్లో ఎగిరేటోడు.. ఏకంగా సూట్ బూటుల్లో సక్కంగా కనిపిస్తుండు! ఈడీడే పాటలు పాడుతూ తిరిగేటోడు.. ఇప్పుడు గా.. ఆస్కార్ ఏడుకలో పాడబోతుండు! ‘ఏం కాక’ అంటూ కనిపించినోళ్లను పలకరించేటోడు.. ఇప్పుడేకంగా కనిపించినోళ్లందరికీ పెక్ ఇస్తూ పోతుండు! ఇలా మొత్తానికి కాక మొత్తం మారిపోయిండులే అని మన భాగ్యరనగర్ పోరగాళ్లతోని అనిపించుకుంటుండు.!

07.Allu arjun gets highest remuneration Sandeep vanga film
ప్రభాస్‌ను బీట్ చేసిన బన్నీ…

పాన్ ఇండియన్ సినిమాలకైనా.. టాప్‌ లేచిపోయేటంత రెమ్యూనరేషన్‌కైనా.. ఇప్పటి వరకు ఎవరు కేరాఫ్‌ గా ఉండేవారు..? ప్రభాసే గా..! కానీ ఈ స్టార్‌ను ఎట్ ప్రజెంట్ దాటేశారు మన ఐకాన్ స్టార్! అలా ఎలా అంటారా? ఏ విషయంలో అంటారా? అయితే లెట్స్‌ వాచ్ దిస్ స్టోరీ

08.Double Updates From Ntr30 Project

ఫ్యాన్స్ అన్నాక.. అడగడం కామన్! అప్డేట్ అంటూ అరవడం కామన్! యాజిటీజ్‌గా… ! హీరోలన్నాక లైట్ తీసుకోవడం కామన్! డోంట్ ఆస్క్‌ అప్డేట్స్! అంటూ ఫైర్ అవడం కూడా కామన్‌! అయితే ఈ కామన్‌ థింగ్‌నే ఎట్ ప్రజెంట్ సర్‌ప్రైజింగ్‌ థింగ్‌గా మార్చబోతున్నారట మన తారక్‌! తన మీద ఫీలైన తన ఫ్యాన్స్ కోసం దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

09. Suriya has cast his vote as a member of The Academy Awards for the Oscars 2023
నేను ఓటు వేశాను..!

ఆస్కార్ అవార్డ్‌ సెర్మనీ దగ్గర పడుతున్నా కొద్దీ అందర్లో ఓకే ఉత్కంఠ. అవార్డు మనకు వస్తుందా లేదాని! ఆస్కార్ జ్యూరీలో ఉన్న మన స్టార్స్ మన నాటు నాటుకే ఓటు వేస్తారా లేదాని? ఇప్పటికే తన ఓటు క్యాస్ట్ చేసిన సూర్య మన నాటు నాటుకు సోపోర్ట్ చేశారో లేదో అని?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 11, 2023 08:19 PM