- Telugu News Photo Gallery Cinema photos Kabzaa Movie Team Promoting Their Movie In Mumbai With Upendra, Sudeep, Shriya, Photos Goes Viral
Kabzaa: ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచేసిన కబ్జా.. శ్రియతో కలిసి బైక్‌పై షికార్లు కొట్టిన ఉపేంద్ర
సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ కబ్జా. ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు. శ్రియా శరణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Updated on: Mar 10, 2023 | 9:48 PM

సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ కబ్జా. ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు. శ్రియా శరణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా పలు ప్రధాన నగరాల్లో పర్యటిస్తోంది.

తాజాగా ముంబైలో సందడి చేశారు హీరో ఉపేంద్ర, శ్రియ, కిచ్చా సుదీప్. కబ్జా సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ ఆనంద్ పండిట్ కూడా చిత్ర బృందంతో చేరి పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ చేశారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉపేంద్ర పాల్గొన్నారు. హీరోయిన్ శ్రియను వెనక కూర్చోబెట్టుకుని షికార్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.




