Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tammareddy: ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమ్మారెడ్డి.. నాగబాబు కామెంట్స్‌పై ఏమన్నారంటే?

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఏ సందర్భంలో ఈ మాటలు అన్నారో గానీ మెగా బ్రదర్‌ నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం గట్టిగా రియాక్టయ్యారు.

Tammareddy: ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమ్మారెడ్డి.. నాగబాబు కామెంట్స్‌పై ఏమన్నారంటే?
Thammareddy, Nagababu
Follow us
Basha Shek

|

Updated on: Mar 10, 2023 | 7:05 PM

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఏ సందర్భంలో ఈ మాటలు అన్నారో గానీ మెగా బ్రదర్‌ నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం గట్టిగా రియాక్టయ్యారు. ముఖ్యంగా నాగబాబు పరుషమైన పదజాలంతో తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు తమ్మారెడ్డి. అలాగే రాఘవేంద్రరావు, నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.’ నేను ఒక సెమినార్ లో పాల్గొని అక్కడ యంగ్ డైరెక్టర్స్ తో దాదాపు 3గంటలు మాట్లాడాను. అయితే అందులో ఒక నిమిషం క్లిప్ మాత్రమే విని ఎవరెవరో రియాక్ట్ అవుతున్నారు. అందులో ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్‌పై మాట్లాడాను. దీనిపై కొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేయటం బాధ కలిగించింది. ఒకరు అకౌంట్స్ అడుగుతారు ఇంకొకరు ఇంకొకటి అంటారు. వీటిని వింటుంటే చాలా బాధగా, అసహ్యంగా ఉంటోంది. వాళ్ల సంస్కారం వాళ్లది నా సంస్కారం నాది. ఇప్పుడు నాకు ఐడెంటిటీ క్రైసిస్ ఏమి లేదు. నన్ను టార్గెట్‌గా చేసుకొని వాళ్లు ఐడెంటిటీ కోసం చేస్తున్నారేమో తెలియదు. నేను కొన్ని రోజుల ముందు రాజమౌళిని అభినందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసాను. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ భారతదేశానికి గర్వకారణమని చెప్పాను. అది ఎవరు చూశారో తెలియదు.. గానీ ఈ వీడియోను చూసి కామెంట్స్ చేస్తున్నారని.. ట్వీట్లు కూడా పెడుతున్నారు’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్‌పై తమ్మారెడ్డి వ్యాఖ్యలు, ఆపై నాగబాబు ఘాటుగా రియాక్టవ్వడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా నాగబాబు భరద్వాజపై పరుషైన పదజాలంతో విమర్శలు చేశారు. మొదట ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌తో తమ్మారెడ్డికి చురకలంటించిన మెగా బ్రదర్‌, ఆతర్వాత ఏకంగా 10 నిమిషాల వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో మరోసారి తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు నాగబాబు. కనీసం కుక్కకు కూడా ఉపయోగపడవంటూ ఘాటైన పదజాలంతో కామెంట్లు చేశారు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా పోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..