Naresh: నరేష్, పవిత్రల పెళ్లి వీడియో నిజం కాదా.? వివాహంపై నరేష్ మౌనానికి కారణం అదేనా..

నరేష్‌, పవిత్రా లోకేశ్‌ల వివాహానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ఎంతగా వైరల్‌ అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్విట్టర్‌ వేదికగా నరేష్‌ ఈ వీడియోను స్వయంగా పోస్ట్‌ చేశారు. ‘ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు..

Naresh: నరేష్, పవిత్రల పెళ్లి వీడియో నిజం కాదా.? వివాహంపై నరేష్ మౌనానికి కారణం అదేనా..
Naresh Pavitra
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 10, 2023 | 6:05 PM

నరేష్‌, పవిత్రా లోకేశ్‌ల వివాహానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ఎంతగా వైరల్‌ అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్విట్టర్‌ వేదికగా నరేష్‌ ఈ వీడియోను స్వయంగా పోస్ట్‌ చేశారు. ‘ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రా నరేష్‌’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అసలు నరేష్‌ వివాహం ఎప్పుడు జరిగిందంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటింటి రామాయణం మూవీ ప్రెస్‌మీట్‌కి హాజరయ్యే సమయంలో నరేష్‌తో టీవీ9 మాట్లాడింది. అయితే ఈ సమయంలో నరేష్‌ పెళ్లి విషయాన్ని మాత్రం దాటేయడం గమనార్హం. ప్రెస్‌మీట్‌ పెట్టి అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పుకొచ్చారు. పెళ్లి అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని, అప్పటి దాకా ఓపిక పట్టండని నరేష్‌ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడితే ‘ఇంటింటి రామాయణం’ ప్రమోషన్ పక్కదోవ పడుతుందని నరేష్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే నరేష్‌ పెళ్లి విషయాన్ని ప్రకటించకపోవడానికి మరో కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. నరేష్‌ తన మాజీ భార్య అయిన రమ్య రఘుపతి నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈ కారణంగానే నరేష్‌ పవిత్రతో పెళ్లి విషయంపై మౌనంగా ఉన్నాడంటున్నారు. అదే విధంగా మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ వీడియో ఏదో సినిమాలోనిది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే నరేష్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..