నాన్నే లైంగికంగా వేధించాడు.. భయపడి మంచం కింద దాక్కున్నా.. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి సంచలన వ్యాఖ్యలు
తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైన వాళ్ల జాబితో మరో సెలబ్రిటీ చేరారు. బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు
తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైన వాళ్ల జాబితో మరో సెలబ్రిటీ చేరారు. బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీసీడబ్ల్యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో స్వామి మాలివాల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్కూల్లో 4వ తరగతి చదివేవరకు తండ్రితో కలిసి ఉన్నట్టు తెలిపారు. చిన్నప్పుడు తండ్రి చిత్రహింసలకు గురిచేశాడన్నారు. తనను ఆయన అకారణంగా కొట్టేవారని , కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేదన్నారు. తండ్రి ఇంట్లోకి వస్తే.. చాలా భయమేసేది. ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నట్టు తెలిపారు. బాల్యం లోనే మహిళల హక్కుల కోసం ఏం చేయాలనేదానిపై ఆలోచించేదాన్నని వెల్లడించారు. ఈ తరహా దుర్మార్గాలకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పాలనుకున్నట్టు స్వాతి మాలివాల్ పిలుపునిచ్చారు. జీవితంలో దారుణాలను ఎదుర్కొన్నవారు.. ఇతరుల బాధను మరింత అర్థం చేసుకుంటారని అన్నారు. బాల్యంలో బాధలు అనుభవించే వాళ్లు వ్యవస్థను మార్చే శక్తిని కలిగిఉంటారని అన్నారు. మహిళా దినోత్సవ అవార్డులు లభించిన వారిలో చాలావరకు మహిళలది దాదాపు ఇదే తరహా పరిస్థితి అన్నారు స్వాతి మాలివాల్. తల్లి, పిన్ని ఇతర కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే అప్పటి అకృత్యాల జ్ఞాపకాల నుంచి బయటపడేదాన్నే కాదని స్వాతి మాలివాల్ చెప్పారు.
కాగా కొద్దిరోజుల క్రితం సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సైతం తన తండ్రిపై ఇటీవల ఇదే తరహా ఆరోపణలు చేశారు. తండ్రి తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని ఆమె చెప్పారు. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది.
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..