AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiraak RP: ఆర్పీ ఆసలు తగ్గట్లేదుగా.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మూడో బ్రాంచ్‌ ప్రారంభం.. ఈసారి ఎక్కడంటే?

జబర్దస్త్ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ అసలు తగ్గడం లేదు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట వరుసగా బ్రాంచ్‌లు ఓపెన్‌ చేస్తున్నాడు. మొదట కూకట్‌ పల్లి వాసులకు తన చేపల కర్రీని రుచి చూపించిన ఆర్పీ ఆ తర్వాత మణికొండలో రెండో బ్రాంచ్‌ ఓపెన్‌ చేశాడు

Kiraak RP: ఆర్పీ ఆసలు తగ్గట్లేదుగా.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మూడో బ్రాంచ్‌ ప్రారంభం.. ఈసారి ఎక్కడంటే?
Kiraak Rp, Srikanth
Basha Shek
|

Updated on: Mar 11, 2023 | 7:03 PM

Share

జబర్దస్త్ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ అసలు తగ్గడం లేదు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట వరుసగా బ్రాంచ్‌లు ఓపెన్‌ చేస్తున్నాడు. మొదట కూకట్‌ పల్లి వాసులకు తన చేపల కర్రీని రుచి చూపించిన ఆర్పీ ఆ తర్వాత మణికొండలో రెండో బ్రాంచ్‌ ఓపెన్‌ చేశాడు. ఈ కార్యక్రమానికి ఆర్పీ పట్నాయక్, హేమ వంటి సినీ ప్రముఖులతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి వంటి జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడో బ్రాంచ్‌ను ఓపెన్‌ చేశాడు. విద్యార్థులు, ఉద్యోగులతో నిత్యం బిజిబిజీగా ఉండే అమీర్‌పేట ఏరియాలో తన చేపల పులుసు కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. ఈ ఓపెనింగ్‌ కార్యక్రమంలో తనకు కాబోయే భార్య లక్కీతో సహా పలువురు మంత్రులు, శ్రీకాంత్‌ దంపతులు, డైరెక్టర్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య లక్కీతో కలిసి శ్రీకాంత్‌ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు ఆర్పీ. ఇప్పటికే శ్రీకాంత్ చాలా సార్లు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తీసుకెళ్లారని కూడా చెప్పాడు. కాగా తన చేపల పులుసు బ్రాంచెస్‌ మూడు మాత్రమే ఉంటాయని, ఇకపై ఇదే పేరుతో ఫ్రాంచైజీస్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు పేర్కొన్నాడీ జబర్దస్త్ కమెడియన్.

కేజీ తీసుకుంటే కుండలో స్పెషల్ ప్యాకింగ్..

కాగా కేవలం డబ్బు కోసమే కాకుండా.. క్వాలిటీ, క్వాంటిటీతో తన చేపల పులుసు కర్రీ పాయింట్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నట్లు ఆర్పీ పేర్కొన్నాడు. కట్టెల పొయ్యి మీదే చేపల పులుసు వండుతున్నామని, పార్శిళ్ల విషయంలో ప్లాస్టిక్‌ కూడా వాడకుండా చూస్తున్నామన్నాడీ కమెడియన్‌. ఇందులో భాగంగా ఒక కేజీ చేపల పులుసు తీసుకుంటే కవర్లలో కాకుండా కుండలో పెట్టి స్పెషల్‌గా ప్యాక్‌ చేసి ఇస్తామన్నాడు. కాగా అమీర్‌పేట బాగా రద్దీగా ఉండే ప్రాంతం. దీంతో మిగతా బ్రాంచ్‌లతో పోలిస్తే ఇక్కడ బిజినెస్‌లో బాగా లాభాలొస్తాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?