మ్యాచ్ మధ్యలోనే ఆస్పత్రికి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరం.. ఐపీఎల్‌కు డౌటే!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగలేదు. అతని స్థానంలో జడేజాను ముందుగా బ్యాటింగ్‌కు దింపాల్సి వచ్చింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగలేదు. అతని స్థానంలో జడేజాను ముందుగా బ్యాటింగ్‌కు దింపాల్సి వచ్చింది. జడేజా ఔటైన తర్వాత కూడా అయ్యర్ కాకుండా వికెట్ కీపర్ కేఎస్ భరత్ క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ను అయితే శ్రేయస్ తీవ్రమైన వెన్ననొప్పికి గురవ్వడమే దీనికి కారణం. స్కానింగ్ కోసం అతనిని మ్యాచ్ మధ్యలోనే హాస్పిటల్‌కు తీసుకెళ్లామని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతణ్ణి పర్యవేక్షిస్తోందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ మ్యాచ్‌లో అయ్యర్ బ్యాటింగ్ చేయడంపై ఇంకా స్పష్టతరాలేదు. అయితే స్కానింగ్ రిపోర్టులు అధికారికంగా వెలువడే వరకు ఎలాంటి ప్రకటన చేయకూడని బీసీసీఐ అధికారుల బృందానికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఒకవేళ అయ్యర్ గాయం తీవ్రత అధికంగా ఉంటే, ఆసీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్-2023కు కూడా దూరమయ్యే అవకాశముందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ సభ్యుడిగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా వెన్ను నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు అయ్యర్. ఈ కారణంగానే బోర్డర్-గవాస్కర్ ట్రోపీ మొదటి టెస్ట్‌తోపాటు అంతకుముందు న్యూజిలాండ్‌పై వన్డే సీరిస్‌లో కూడా ఆడని విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ ఉన్నాడు.
Shreyas Iyer has lower back pain. He’s gone for scans!
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..