- Telugu News Photo Gallery Cricket photos Ind vs aus virat kohli century with sickness says anushka sharma axar patel reaction
Virat Kohli: అనారోగ్యంతో బాధపడుతున్నా.. అద్భుత ఇన్నింగ్స్.. రన్‌మెషీన్‌పై పొగడ్తల వర్షం..
విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 186 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, అనారోగ్యంతో ఉన్నా అద్భుత ఇన్నింగ్స్ ఆడినట్లు ఆయన భార్య అనుష్క శర్మ వెల్లడించింది.
Updated on: Mar 13, 2023 | 6:25 AM

అహ్మదాబాద్ టెస్టు నాలుగో రోజు విరాట్ కోహ్లీ తన అద్భుతమైన సెంచరీతో ప్రతి భారత క్రికెట్ అభిమానిని అలరించాడు. ఓ వైపు మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న భారాన్ని ఈ సెంచరీతో కోహ్లి తొలగించుకుంటూనే.. మరోవైపు అతడి ఇన్నింగ్స్‌పై పలు రకాలుగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నా ఈ ఇన్నింగ్స్ ఆడానని కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ వెల్లడించింది.

మార్చి 12, ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ 186 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లి 364 బంతులు ఎదుర్కొన్నాడు. అహ్మదాబాద్‌లోని మండే వేడిలో సుమారు 8 గంటల పాటు బ్యాటింగ్ చేశాడు.

విరాట్ ఈ సెంచరీ తర్వాత, అందరూ సెల్యూట్ చేస్తున్నారు. కోహ్లి అనారోగ్యంతో ఉన్నప్పటికీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడని ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ నటుడు అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. "అనారోగ్యంతో ఉన్నప్పటికీ చాలా ప్రశాంతంగా ఆడావు. మీరు ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తినిస్తారు' అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత, కోహ్లి అస్వస్థతకు గురికావడంపై టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అండగా నిలిచాడు. అక్షర్ పటేల్ రెండవ సెషన్ నుంచి మూడవ సెషన్ వరకు కోహ్లీతో 164 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఈ సమయంలో వారిద్దరూ చాలా సేపు పరుగులు పెట్టారు.

కోహ్లిని చూడగానే అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించలేదని అక్షర్ చెప్పుకొచ్చాడు. అక్షర్ మాట్లాడుతూ, “విరాట్ అనారోగ్యంతో ఉన్నాడని నేను అనుకోను. నాకు తెలియలేదు కూడా. అతను వికెట్ల మధ్య పరుగులు పెట్టిన తీరు చూస్తే, అతనికి అనారోగ్యంగా అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.




