- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli breaks another milestone owned by Sachin Tendulkar and surpasses him very quickly
Virat Kohli: సెంచరీల పరంగా సచిన్‌ను అధిగమించిన కింగ్ కోహ్లీ..! అదెలా అంటే..?
దాదాపు 1205 రోజుల తర్వాత టెస్టు సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికట్‌లో తన 75వ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సెంచరీతో సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టి లెక్కలు తిరగరాశాడు కోహ్లీ. అదెలా అంటే..
Updated on: Mar 13, 2023 | 3:56 PM

అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో కింగ్ కోహ్లీ భారీ సెంచరీ(186)తో తన 28వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అలాగే ఇది కోహ్లీ కెరీర్‌లో 75వ సెంచరీ కూడా.

అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కూడా చరిత్ర పుటల్లో నిలిచాడు. విశేషమేమిటంటే ఇంతకముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మినహా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 75 సెంచరీలు సాధించలేదు. ఇప్పుడు ఈ జాబితాలో రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ చేరాడు.

ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. అదెలా అంటే సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 75 సెంచరీలు పూర్తి చేశాడు.

సచిన్ టెండూల్కర్ మొత్తం 566 ఇన్నింగ్స్‌ల్లో 75 సెంచరీలు సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ కంటే వేగంగా డెబ్బై ఐదు సెంచరీలు పూర్తి చేశాడు కోహ్లీ.

సచిన్ కంటే వేగంగా.. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 552 ఇన్నింగ్స్‌ల ద్వారా 75 సెంచరీలు సాధించాడు. దీంతో సచిన్ కంటే వేగంగా 75 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా నిలవడమే కాక తక్కువ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సెంచరీలు చేసి మాస్టర్ బ్లాస్టర్ కంటే ముందు ఉన్నాడు కోహ్లీ.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఆగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 782 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 552 ఇన్నింగ్స్‌ల్లో 75 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.




