IPL Top 5 Run Scorer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 సీజన్లలో ఎంతో మంది బ్యాట్స్‌మెన్స్ తుఫాన్ బ్యాటర్స్‌ని చూశాం. అయితే, పరుగుల రేసులో ఎవరు ముందున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Mar 14, 2023 | 8:25 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 సీజన్లు పూర్తయ్యాయి. ఈ 15 సీజన్లలో బ్యాట్‌తో మైదానంలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఎందరో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లను చూసే అవకాశం అభిమానులకు లభించింది. ఈ లీగ్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1 / 6
ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆర్సీబీ తరపున 15 ఏళ్ల పాటు ఆడిన కోహ్లీ 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌లో 44 అర్ధ సెంచరీలు, ఐదు సెంచరీలు వచ్చాయి. ఐపీఎల్‌లో కోహ్లీ సగటు 36.19గా నిలిచింది.
2 / 6
కోహ్లీ తర్వాత రెండో స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. 15 ఏళ్లలో ధావన్ ఆరు జట్ల తరపున ఆడాడు. అతను మొత్తం 206 మ్యాచ్‌లు ఆడి 6244 పరుగులు చేశాడు. క్రికెట్ ప్రపంచంలో గబ్బర్‌గా పేరొందిన ధావన్ రెండు సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 126.34గా నిలిచింది.
3 / 6
ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఒక్కడే టాప్ 5గురు ప్లేయర్లలో విదేశీ ఆటగాడిగా నిలిచాడు. గత 14 ఏళ్లలో, ధావన్ మూడు జట్ల తరపున ఆడాడు. అతను మొత్తం 5881 పరుగులు చేశాడు. వార్నర్ నాలుగు సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు సాధించాడు. ధావన్ సగటు 42.00 కాగా అతని స్ట్రైక్ రేట్ 140.69గా నిలిచింది.
4 / 6
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున 227 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 5879 పరుగులు చేశాడు. శర్మ ఐపీఎల్‌లో 40 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.
5 / 6
మిస్టర్ ఐపీఎల్‌గా పిలువబడే సురేష్ రైనా రిటైర్మెంట్ అయినప్పటికీ ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మినహా గుజరాత్ లయన్స్ తరపున మాత్రమే మ్యాచ్‌లు ఆడాడు. 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. అతను ఒక సెంచరీ, 39 అర్ధ సెంచరీలు చేశాడు.