WPL 2023: 33 బంతుల్లో 160కు పైగా స్ట్రైక్‌రేట్‌తో సునామీ ఇన్నింగ్స్‌.. బిత్తరపోయిన బౌలర్లు.. టోర్నీలో తిరుగులేని ప్లేయర్‌గా..

మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది . హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఈ జట్టు, టోర్నమెంట్‌ను అట్టహాసంగా ప్రారంభించిన అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది

WPL 2023: 33 బంతుల్లో 160కు పైగా స్ట్రైక్‌రేట్‌తో సునామీ ఇన్నింగ్స్‌.. బిత్తరపోయిన బౌలర్లు.. టోర్నీలో తిరుగులేని ప్లేయర్‌గా..
Harmanpreet Kaur
Follow us
Basha Shek

|

Updated on: Mar 13, 2023 | 6:15 AM

మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది . హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఈ జట్టు, టోర్నమెంట్‌ను అట్టహాసంగా ప్రారంభించిన అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. కేవలం 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌ సహాయంతో 53 పరుగులు చేసింది కౌర్‌. దీంతో పటిష్ఠమైన యూపీ వారియర్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో యూపీ 4 మ్యాచ్‌ల్లో రెండో ఓటమిని చవిచూసింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ కెప్టెన్ అలిస్సా హీలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. RCBపై రికార్డు స్థాయిలో 96 పరుగులు చేసిన హీలీ 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 పరుగులు చేసింది. హీలీతో పాటు, జట్టు స్టార్ ఆల్ రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ కూడా టోర్నమెంట్‌లో తన రెండో అర్ధ సెంచరీని నమోదు చేసింది. మెక్‌గ్రాత్ 37 బంతుల్లో 50 పరుగులు చేసింది. వీరిద్దరి మధ్య 82 పరుగుల భాగస్వామ్యం రావడంతో యూపీ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ముంబై లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్ మరోసారి తన సత్తా చాటుతూ హీలీ, మెక్‌గ్రాత్‌లతో సహా మొత్తం 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు లెగ్ స్పిన్నర్ అమేలియా కర్ కూడా 2 వికెట్లతో రాణించింది.

ఇక ముంబై తరుపున, యువ ఓపెనర్ యాస్తికా భాటియా (42 పరుగులు, 27 బంతుల్లో) మెరుపు ఆరంభం ఇచ్చింది. దీంతో ముంబై 7 ఓవర్లలో 58 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో, హేలీ మాథ్యూస్‌పై ఎల్‌బీడబ్ల్యు అప్పీల్‌పై యూపీ రివ్యూ తీసుకున్నప్పుడు డీఆర్‌ఎస్‌కు సంబంధించి కొంత గందరగోళం ఏర్పడింది. 7, 8 ఓవర్లలో ఓవర్లలో యాస్తికా భాటియా, మాథ్యూస్ ఔట్ కావడంతో కెప్టెన్ కౌర్, నేట్ సివర్ జట్టు గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. వీరిద్దరూ కేవలం 10.1 ఓవర్లలో 106 పరుగుల జోడించి జట్టును గెలిపించారు. హర్మన్‌ప్రీత్ మరో అర్ధ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా, నేట్ సీవర్ కూడా 45 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మన్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..