అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని యువకులు చేసే ప్రమాదకర స్టంట్స్ పబ్లిక్ సేఫ్టీకి పెను సవాల్ విసురుతున్నాయి. మైసూరులో నడిరోడ్డుపై రాత్రివేళ పోలీసుల ముందే స్టంట్స్ చేసిన యువకులు ఇప్పుడు కఠిన చర్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలపై పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తూ తాము ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదాల్లోకి నెడుతుంటారు. తాజాగా అలా రాత్రివేళ నడిరోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ పోలీసుల ముందే రెచ్చిపోయారు కొందరు ఆకతాయిలు. పోలీసులు చూస్తూ ఊరుకోరుకదా.. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. కర్ణాటకలోని మైసూరు నగరంలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల ముందే స్టంట్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. అర్ధరాత్రి వేళ రోడ్డుపై అతివేగంగా వేళ్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. వీరి చర్యకు అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ తతంగాన్ని ప్రత్యక్షంగా చూసిన పోలీసులు వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. భారీగా జరిమానా కూడా విధించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇవి పిచ్చి ఆకులు కాదండి బాబు.. విషయం తెలిస్తే షాకవుతారు
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

