Potato Myths: ఆలూ తింటే బరువు పెరుగుతారా? అసలు నిజమేంటి.. నిపుణులు ఏం చెప్పారంటే?
ఆలూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే కూరగాయల్లో ఒకటి. ఈ కూరగాయ లేకుండా ఏ ఉంట్లో వంటలు పూర్తి కావు. వారంలో కనీసం ఒక్కరోజైనా ఆలూ కర్రీ వండాల్సిందే. అయితే చాలా మంది ఆలూ తినడం వల్ల ఊబకాయం పెరుగుతుందనే భయంతో దానిని తినడం మానేస్తున్నారు. అయితే దీని గురించి ఆరోగ్య నినులు ఆశ్చర్య కర విషయాలు వెల్లడించారు. అదేంటో తెలుసుకుందాం.

ఆలూ తినడానికి అందరూ ఇష్టపడుతారు. కానీ ఆరోగ్యం, బరువు విషయానికి వస్తే, బంగాళాదుంపలను జనాలు తరచుగా దూరం పెడుతూ ఉంటారు. ఎందుకంటే వీటిలో ఉండే అధిక పిండి పదార్ధం తినడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. అందుకే చాలా మంది బంగాళాదుంపలకు దూరంగా ఉంటారు. కానీ బంగాళాదుంపలు నిజంగా అంత అనారోగ్యకరమైనవా? అంటే కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. హెల్త్‌లైన్ వెబ్‌సైట్ ప్రకారం, ఆలుగడ్డలను సరైన రీతిలో, సరైన పరిమాణంలో తింటే అవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు. అయితే, ఇది మీరు వాటిని ఎలా వండుతున్నారు. ఎంత తీసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
అపోహ 1: బంగాళాదుంపలు కేవలం కేలరీలు మాత్రమే
బంగాళాదుంపలలో ఎటువంటి పోషకాలు ఉండవని.. వాటిలో కేవలం కేలరీలు మాత్రమే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బంగాళాదుంపలలో సహజ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. దీని అర్థం అలూలో కేవలం కార్బోహైడ్రేట్లు లేదా స్టార్చ్ మాత్రమే కాదు, అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయని. ఇవన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అపోహ 2: బంగాళాదుంపలు తినడం వల్ల బరువు పెరుగుతుంది
ఆలూ తినడం వల్ల బరువు పెరగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ వాటిని సైరన విధానంలో వండితే అలాంటి సమస్యే ఉండదు. ఆలూతో మీరు ఫ్రెంచ్ ఫ్రైస్, కట్లెట్స్, టిక్కీస్ వంటివి చేసుకొని తింటే మీరు బరువు పెరుగుతారు. ఎందుకంటే ఆలూను డీప్-ఫ్రై చేయడం వల్ల అందులో కొవ్వు, కేలరీలు పెరుగుతాయి. కాబట్టి ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి. అలా కాకుండా ఉడికించిన, కాల్చిన, బేక్ చేసిన లేదా గ్రిల్ చేసిన బంగాళాదుంపలు తినడం ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొవ్వు, కేలరీలను తక్కువ ఉంటాయి.
అపోహ 3: మధుమేహం ఉన్నవారు ఆలూ తినకూడదు:
ఆలూలో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుందనేది నిజం, ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. అయితే, ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరగడమనేది.. మీరు ఆలూను తినే విధానం, తీసుకునే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అవును ఆలూను ఉడకబెట్టడం వల్ల వాటి పిండి పదార్ధం నిరోధక పిండిగా మారుతుంది, ఇది ఫైబర్ లాగా పనిచేస్తుం. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. కాబట్టి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలతో పాటు అలూ తింటే షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచవచ్చు.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
