AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. ఈ మిరపకాయ తిన్నారంటే ఖతమే..! గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించిన మహా కారం! 🌶️

ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మిరపకాయలు ఉన్నాయి. వాటిలో కొన్ని తేలికపాటి కారంగా ఉంటాయి. మరికొన్ని అత్యంత కారంగా ఉంటాయి. భారతదేశంలో అత్యంత ఘాటైన మిరపకాయ అస్సాంలో దొరికే భుట్ జోలోకియా. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ. కానీ, ఇప్పుడు ఈ మిరపకాయను అధిగమించిన మిరపకాయ ఉంది. అది ప్రపంచంలోనే అత్యంత ఘాటైనది.

ఓరీ దేవుడో.. ఈ మిరపకాయ తిన్నారంటే ఖతమే..! గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించిన మహా కారం! 🌶️
Carolina Reaper Hottest Chilli In The World
Jyothi Gadda
|

Updated on: Jan 11, 2026 | 5:17 PM

Share

మన దేశప్రజలు ఎక్కువగా కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. అందుకే, ఇక్కడ మిరపకాయలను విస్తృతంగా పండిస్తారు. కొన్ని రకాల మిరపకాయలు అస్సలు కారంగా ఉండవు. కానీ కొన్ని చాలా కారంగా ఉంటాయి. ఒక్కటి తింటేనే చెమట పడుతుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ ఏది అని మీకు తెలుసా..? అత్యంత ఘాటైన ఈ మిరపకాయ ఎక్కడ పండుతుందో, దాని పేరు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..దీని కారం కాస్త తిన్నారంటే..మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే. మరోమారు ఈ కారం తినాలనే ఆలోచన కూడా చేయరు.

భారతీయ, మెక్సికన్, థాయ్ వంటకాల్లో భాగమైన మిరపకాయలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో అంతర్భాగంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మిరపకాయలు ఉన్నాయి. వాటిలో కొన్ని తేలికపాటి కారంగా ఉంటాయి. మరికొన్ని అత్యంత కారంగా ఉంటాయి. భారతదేశంలో అత్యంత ఘాటైన మిరపకాయ అస్సాంలో దొరికే భుట్ జోలోకియా. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ. కానీ, ఇప్పుడు ఈ మిరపకాయను అధిగమించిన మిరపకాయ ఉంది. అది ప్రపంచంలోనే అత్యంత ఘాటైనది.

అవును ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ అమెరికాలో పండించే కరోలినా రీపర్. బెల్ పెప్పర్ లాగా కనిపించే ఈ మిరపకాయ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. శాస్త్రవేత్తల ప్రకారం కరోలినా రీపర్ లాగా ఇంతవరకు ఏ మిరపకాయ ఘాటుగా లేదని చెబుతున్నారు. అయితే, మిరపకాయ ఘాటును ఎలా కొలుస్తారో చూద్దాం.

ఇవి కూడా చదవండి

మిరపకాయ ఘాటును స్కోవిల్లే హీట్ యూనిట్స్ (SHU) అనే స్కేల్‌పై కొలుస్తారు. ఈ స్కేల్‌ను అమెరికన్ ఫార్మసిస్ట్ విల్బర్ స్కోవిల్లే 1912లో అభివృద్ధి చేశారు. SHU ఎంత ఎక్కువగా ఉంటే, మిరపకాయ అంత ఘాటుగా ఉంటుంది. పేపర్ X కి ముందు, కరోలినా రీపర్ ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ. దీని SHU దాదాపు 22 లక్షలు ఉండేది. భారతదేశపు భుట్ జోలోకియా కూడా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదు చేయబడింది. దీని SHU దాదాపు 10 లక్షలు. దీని తరువాత భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుంటూరు మిరపకాయ భుట్‌ జోలోకియా తర్వాత రెండవ స్థానంలో ఉంది.

పెప్పర్ ఎక్స్ లేదా కరోలినా రీపర్ వంటి మిరపకాయలను నేరుగా తినడం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, వికారం, గొంతు, అన్నవాహిక దెబ్బతినడం, అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అందుకే వైద్యులు, పోషకాహార నిపుణులు అలాంటి మిరపకాయలను నేరుగా తినకూడదని సిఫార్సు చేస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..