ఓరీ దేవుడో వీళ్లకు జామకాయ వెరీ డేంజర్..! అస్సలు తినొద్దు తెలుసా?
జామకాయను పేదవాడి ఆపిల్‌గా పిలుస్తారు. ఎందుకంటే.. ఇది పుష్కలమైన పోషకాలు కలిగి ఉంటుంది. పైగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తుంది. జామపండ్లు ఈ సీజన్‌లో మరింత ఎక్కువగా లభిస్తాయి. జామపండులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల, వాటిని తినడం వల్ల గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, ఇవి అందరికీ సరిపోకాదు. అవును, జామ చాలా పోషకమైన పండు అయినప్పటికీ, ఇది కొంతమందికి హానికరం కావచ్చు. జామను ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

జామపండులో విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియంతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. దీని వలన రోగ నిరోధక శక్తిపెరుగుతుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. జామపండులో నారింజ పండుకంటే అధికంగా విటమిన్ సి ఉంటుంది. దీని వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. జామపండులో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ కొందరు వీటిని తినకపోవడం మంచిది. దీని వలన వారిలో పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కడుపు ఉబ్బరంతో బాధపడే వారు జామకాయలు తినకపోవడం మంచిది. ఇందులో ఫ్రక్టోజ్, విటమిన్ సి సమృద్దిగా ఉండటం వలన కడుపు ఉబ్బరం పెరిగే అవకాశం ఉంది. గ్లైసిమిక్ ఇండెక్స్ గ్లూకోజ్‌లో తక్కువగా ఉండటం వలన డయాబెటిస్ రోగులు వీటిని తినవచ్చని చెబుతుంటారు. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు ఎక్కువ మోతాదులో జామకాయలు తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జామకాయలో కరిగే ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. దీని వలన జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్దకం తగ్గుతుంది. ఇర్రిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) సమస్యతో బాధపడేవారు జామకాయలు తినకపోవడం మంచిది.
జామపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను సులభంగా తొలగిస్తాయి. కానీ మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉన్నవారికి లేదా మూత్రపిండాల డయాలసిస్‌లో ఉన్నవారికి, అదనపు పొటాషియం హానికరం కావచ్చు. అలాంటి సందర్భాలలో, జామపండ్లను పరిమిత పరిమాణంలో తినడం లేదా వాటిని పూర్తిగా నివారించడం మంచిది.
అలాగే, జామకాయ గట్టిగా ఉంటుంది. కాబట్టి, పచ్చి జామకాయను నమలడం వల్ల దంతాలపై ఒత్తిడి పెరుగుతుంది. బలహీనమైన దంతాలు, దంత సమస్యలు లేదా చిగుళ్ల సమస్యలు ఉన్నవారు జామకాయను నమలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జామకాయ గింజలు దంతాలలో కూడా పేరుకుపోయి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే, కొంతమందికి జామపండు అలెర్జీ ఉండవచ్చు. దురద, దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే జామ తినడం మానేసి వైద్యుడిని సంప్రదించండి. జామపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి, మీకు జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే జామ తినడం మానుకోవాలి. ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




