Tips To Save Cooking Gas: ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే.. మీ వంట గ్యాస్ బోలెడంత ఆదా..!
పెరిగిన నిత్యావసరాలు, ఇంధన ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ముఖ్యంగా వంట గ్యాస్ ఖర్చులు నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చు. సరళమైన కిచెన్ చిట్కాలను పాటిస్తూ గ్యాస్ వృథాను అరికట్టండి, నెలవారీ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోండి. మీ వంటను మరింత సమర్థవంతంగా చేయండి.

అదేదో సినిమాలో చెప్పినట్టుగా ప్రస్తుత ధరలు చూస్తుంటే ఏం కొనేటట్టులేదు. ఏం తినేటట్టు లేదు. సామాన్యుల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మాత్రమే కాదు. ప్రజల నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ప్రతీది సామాన్యుల నడ్డి విరిచేలా పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు నిలకడగా వున్న ధరలు నేడు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతున్నాయి. అందుకే అన్నింటిలో పొదుపు, జాగ్రత్తలు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ప్రతి వంటింట్లోనూ తప్పని సరి వినియోగం అయిన గ్యాస్‌ను కూడా ఎంత పరిమితంగా వాడుకుంటే అంతే మంచిది. కొన్ని చిట్కాలు పాటిస్తూ గ్యాస్ వృధా కాకుండా ఆదా చేసుకోవచ్చు. దీంతో మీ టైమ్, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం…
వంట చేసేటప్పుడు ముందుగా వంటకు కావలసిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవలి. ఆ తర్వాతే గ్యాస్ స్టౌవ్‌ను వెలిగించుకోవాలి. వంట పాత్రపై మూత సరిగ్గా పెట్టాలి. దీనివల్ల వేడి సరిగ్గా అందుతుంది. ఆహారం త్వరగా ఉడుకుతుంది. బర్నర్‌కు సరిపోయే పాత్రను ఎంచుకోవాలి. చిన్న బర్నర్‌పై పెద్ద పాత్ర పెట్టడం సరైనది కాదు. దీని వల్ల గ్యాస్ వృధా అవుతుంది.
బీన్స్, పప్పులు, బియ్యం వంటివాటిని వండే ముందు నీటిలో నానబెట్టడం మంచిది. దానివల్ల త్వరగా ఉడుకుతాయి. అలాగే, కాయగూరలను ఉడకబెట్టేందుకు తగినంత నీరు మాత్రమే వాడాలి. అలాకాకుండా ఎక్కువ నీరు పోసి వండితే.. అందులో వున్న పోషకాలు వృథా అవడమే కాకుండా గ్యాస్, సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఫలితంగా వంట రుచి కూడా పాడవుతుంది. ఆహార పదార్థాలను ఎప్పుడూ చిన్న మంటపై ఉడికించాలి. దానివల్ల గ్యాస్ వృథా కాదు. ఆహారం బాగా ఉడుకుతుంది.
లేదంటే, ఏ వంటకానికైనా సరే, ప్రెషర్ కుక్కర్ వాడితే చాలా మంచిది. అలాగే, బర్నర్లపై మురికి చేరితే గ్యాస్ రాకుండా అడ్డుపడుతుంది. వంటకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బర్నర్లను తరచూ శుభ్రం చేయాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడి చేసేందుకు వెంటనే స్టౌవ్‌పై పెట్టకూడదు. ముందుగా వాటిని గది టెంపరేచర్ వద్ద కొద్దిసేపటివరకు ఉంచిన అనంతరం స్టౌవ్‌పై ఉంచి వేడి చేయాలి. అప్పుడవి త్వరగా వేడెక్కుతాయి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




