AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడ్ రూమ్ లో ఈ మొక్క ఉంటే ఎంత మంచిదో తెలుసా ? అద్భుతమైన ప్రయోజనాలు..

ఈ మీని ప్లాంట్‌ను పడకగదిలో సురక్షితంగా పెంచుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి హాని ఉండదు. ఇది మంచి నిద్రకు సహాయపడతుంది. పైగా ఇది తక్కువ శ్రద్ధతో సులభంగా పెంచుకోగల మొక్క. దీనికి రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. ఈమొక్కకు ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఉన్న ఆకులు ఉంటాయి. ఇది మీ పడకగది అందాన్ని రెట్టింపు చేస్తుంది.

బెడ్ రూమ్ లో ఈ మొక్క ఉంటే ఎంత మంచిదో తెలుసా ? అద్భుతమైన ప్రయోజనాలు..
Spider Plant Benefits
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2026 | 12:38 PM

Share

స్పైడర్ ప్లాంట్స్ ఇంటి లోపలి గాలిని శుద్ధి చేస్తాయి. అవి కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, జిలీన్ వంటి హానికరమైన విషాలను గ్రహిస్తాయి. ఇది మీ పడకగది వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా చేస్తాయి. స్పైడర్ ప్లాంట్.. పడకగదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. కాలుష్య కారకాలను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. తేమను విడుదల చేస్తుంది. కాబట్టి గదిలో ఎప్పుడూ తేమ వాతావరణం ఉంటుంది.

స్పైడర్ ప్లాంట్‌ను పడకగదిలో సురక్షితంగా పెంచుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి హాని ఉండదు. ఇది మంచి నిద్రకు సహాయపడతుంది. పైగా ఇది తక్కువ శ్రద్ధతో సులభంగా పెంచుకోగల మొక్క. దీనికి రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. స్పైడర్ ప్లాంట్ కు ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఉన్న ఆకులు ఉంటాయి. ఈ మొక్క పడకగది అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్పైడర్ ప్లాంట్ గదిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. ఈ మొక్కలు పగలు, రాత్రి తేడా లేకుండా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీంతో మీ పడకగదిలో ఫ్రెష్ గాలి సరఫరా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది మెరుగైన శ్వాసకు, ప్రశాంతమైతో కూడిన నిద్రకు సహకరిస్తుంది.

స్పైడర్ ప్లాంట్స్ చుట్టూ ఉండటం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని, విశ్రాంతిని ప్రోత్సహిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా స్పైడర్ ప్లాంట్స్ పచ్చదనం మీ పడకగదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. గాలిలోకి తేమను విడుదల చేస్తుంది. కాబట్టి, పొడి చర్మం, పొడి గొంతు, శ్వాసకోశ సమస్యల వంటివి దరిచేరకుండా చేస్తుంది. అంతేకాదు.. ఈ స్పైడర్ ప్లాంట్స్‌ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా సులభం. అవి తక్కువ నీరు తీసుకోవడంతో పాటు.. పరోక్ష కాంతిలో బాగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

స్పైడర్ ప్లాంట్స్‌ ముఖ్యంగా రాత్రి సమయంలో కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. ఇది మీ పడకగదిలో తాజా, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చేస్తుంది. గాలి నాణ్యతను మెరుగుపరచడం, తేమను పెంచడం ద్వారా గాలిలో అలెర్జీ కారకాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు… స్పైడర్ ప్లాంట్స్‌ మీ బెడ్‌రూమ్‌ను సహజ సౌందర్యాన్ని అందేస్తాయి. పైగా, ఇవి‌ మానవులకు, పెంపుడు జంతువులకు ఎలాంటి విషపూరితం కావు. ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..