AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కరిస్తేనే కాదు.. తోకతో కొట్టినా చనిపోతారా..? దాడి చేస్తే ఏమౌతుందో తెలిస్తే..

మీరు పాముల గురించి చాలా విషయాలు విని ఉండవచ్చు. వాటిలో ఒకటి పాము తోకలో విషం ఉంటుంది. అలాగే, తోకలో ముల్లు ఉందని, అది కాటు వేస్తే తలనొప్పి, జ్వరం లేదా మరణం కూడా సంభవిస్తుందని చెబుతారు. పాములు కరిస్తే మరణం ఖాయమని నమ్ముతుంటారు. కాబట్టి జనాలు వాటి దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. కానీ, విశేషమేమిటంటే విషం పాము నోటిలోనే కాదు, దాని తోకలో కూడా ఉంటుందా..?

పాము కరిస్తేనే కాదు.. తోకతో కొట్టినా చనిపోతారా..? దాడి చేస్తే ఏమౌతుందో తెలిస్తే..
Snake
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2026 | 11:28 AM

Share

పాములంటే దాదాపు అందరికీ హడలే. ఇక కొందరైతే, పాము పేరు చెబితేనే వణికిపోతారు. ఎందుకంటే.. పాము కాటుతో మనిషి ప్రాణాలు పోవడం పక్కా అంటారు. అందుకే..పాములకు వీలైనంత దూరంగా పారిపోతుంటారు. అయితే, మన దేశంలో పాములను కూడా దైవానికి ప్రతీకగా పూజిస్తారు. ముఖ్యంగా నాగుపాము దైవిక రూపంగా పరిగణించబడుతుంది. అలాగే, ఇది శివుని హారంగా నమ్ముతారు. ఇక మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల పాములు ఉన్నాయి. కొన్ని చాలా విషపూరితమైనవి అయితే, మరికొన్ని విషపూరితం కానివి. వీటిలో పాము తోకలో కూడా కర్కోటక విషం ఉందని తెలిస్తే నమ్ముతారా..? ఇది నిజమేనా? పూర్తిగా తెలుసుకుందాం.

మీరు పాముల గురించి చాలా విషయాలు విని ఉండవచ్చు. వాటిలో ఒకటి పాము తోకలో విషం ఉంటుంది. అలాగే, తోకలో ముల్లు ఉందని, అది కాటు వేస్తే తలనొప్పి, జ్వరం లేదా మరణం కూడా సంభవిస్తుందని చెబుతారు. పాములు కరిస్తే మరణం ఖాయమని నమ్ముతుంటారు. కాబట్టి జనాలు వాటి దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. కానీ, విశేషమేమిటంటే విషం పాము నోటిలోనే కాదు, దాని తోకలో కూడా ఉంటుందట.. దాంతో కూడా మరణం సంభవిస్తుందని అంటున్నారు. ఇది నిజమేనా..?

కొంతమందికి పాము తోకతో దాడి చేసిన తర్వాత జ్వరం, తలనొప్పి వస్తుంది. ఆ తరువాత వారి పరిస్థితి భయానకంగా మారుతుంది. ఇది మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. భయం, ఒత్తిడి అడ్రినలిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది తలనొప్పికి, కొన్నిసార్లు జ్వరానికి దారితీస్తుంది. కొన్నిసార్లు చర్మంపై గీతలు పడితే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చాలా సున్నితమైన ఆరోగ్యం, చర్మం కలిగి ఉంటారు. అలాంటి వారికి చిన్న గాయాలు, ఒత్తిడితో కూడా తలనొప్పి, జ్వరం రావచ్చు. పాము తన తోకతో దాడి చేసినప్పుడు బాధిత వ్యక్తి భయపడి అనారోగ్యానికి గురవుతాడు.

ఇవి కూడా చదవండి

పాము తోకతో దాడి చేయటం వల్ల వ్యక్తి స్పృహ కోల్పోడు. జ్వరం రాదు. ఇకపోతే, పాము తోకలో విషం ఉండదు. అది తన తోకను రక్షణ యంత్రాంగంగా మాత్రమే ఉపయోగిస్తుంది. ఎవరినైనా పాము తన తోకతో దాడి చేసినప్పుడు టెన్షన్‌ పడకండి. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు గాయపడితే మాత్రం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందడం తప్పనిసరి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ హీరో కోసం నా ప్రాణాలైనా ఇస్తా..!
ఆ హీరో కోసం నా ప్రాణాలైనా ఇస్తా..!
భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా..
భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా..
అదో షుగర్ బాంబ్! జెన్ జీల ఫేవరెట్ ఫుడ్ వెనుక చేదు నిజం ఇదే!
అదో షుగర్ బాంబ్! జెన్ జీల ఫేవరెట్ ఫుడ్ వెనుక చేదు నిజం ఇదే!
విదుర నీతి: మనిషి దుఃఖానికి అసలు కారణాలు ఇవే.. వదులుకుంటే హ్యాపీ
విదుర నీతి: మనిషి దుఃఖానికి అసలు కారణాలు ఇవే.. వదులుకుంటే హ్యాపీ
కార్ల టైర్లలో నైట్రోజన్‌ లేదా సాధారణ గాలి.. ఇందులో ఏది మంచిది?
కార్ల టైర్లలో నైట్రోజన్‌ లేదా సాధారణ గాలి.. ఇందులో ఏది మంచిది?
ఇంటి పునాది తీస్తుండగా బయటపడిన కుండ.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..
ఇంటి పునాది తీస్తుండగా బయటపడిన కుండ.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..
చలికాలంలో ఇవి తింటే మీ చిట్టి గుండె పని అయిపోయినట్లే..
చలికాలంలో ఇవి తింటే మీ చిట్టి గుండె పని అయిపోయినట్లే..
నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..!
నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..!
ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి?
ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి?
ప్రతి తరం తనను తాను తోపు అనుకుంటే జరిగే నష్టమేంటో తెలుసా?
ప్రతి తరం తనను తాను తోపు అనుకుంటే జరిగే నష్టమేంటో తెలుసా?