AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..! డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా..?

లండన్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దెలు విస్తుగొలుపుతున్నాయి. భారతీయ యువతి దీపాంశి చౌదరి క్రిస్మస్ సమయంలో నెలకు ఏకంగా ₹8 లక్షలు చెల్లించింది. సెంట్రల్ లండన్‌లోని సౌకర్యవంతమైన ఈ ఫ్లాట్‌కు పండుగ సీజన్ కారణంగా అధిక అద్దె వచ్చిందని ఆమె పేర్కొంది. లండన్ అద్దెల వ్యయంపై ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..! డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా..?
London Rent Shock
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2026 | 8:52 AM

Share

లండన్ లాంటి ఖరీదైన నగరంలో నివసించడం అంత సులభం కాదు. కానీ, ఒక భారతీయ యువతి ఒక చిన్న 1BHK అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.8,00,000 అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అయిన ఈ వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, ఆ వాదనలో వాస్తవం ఎంత అనే దానిపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తింది.

దీపాంషి చౌదరి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లండన్‌లో నివసిస్తున్న భారతీయ యువతి దీపాంశి చౌదరి, తాను అద్దెకు తీసుకున్న సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ నెలకు సుమారు రూ.8 లక్షలు పైనే ఉందని తెలిపారు. ఇది పూర్తిగా ఫర్నిష్ చేయబడింది. కానీ, అద్దె మరీ ఎక్కువగా ఉంది. సెంట్రల్ లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ ఎదురుగా ఉన్న ఈ ఫ్లాట్‌లో లాబీ, వాష్‌రూమ్, స్టోరేజ్ రూమ్, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ ఉన్నాయి. క్రిస్మస్ పండుగ సమయంలో ఒక నెల రోజుల స్వల్పకాలిక బస కోసం ఈ అద్దె చెల్లించాల్సి వచ్చిందని, పండుగ సీజన్ కావడంతో అద్దె అధికంగా ఉందని ఆమె పేర్కొంది. కానీ లొకేషన్ విలువైనది అని రాశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తాయి. తక్కువ అద్దెకు లండన్‌లో మెరుగైన ఇల్లు దొరుకుతుందని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు. ఒక వినియోగదారు ఇలా రాశారు, చాలా మంది లండన్‌లో ఇంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయలేరు. మీరు ఎలాంటి పని చేస్తారు? మరొకరు, నేను కానరీ వార్ఫ్‌లో నివసిస్తున్నాను. నా మొత్తం 3BHK ఫ్లాట్ ధర బిల్లులతో సహా 3200 పౌండ్లు. సెయింట్ పాల్స్ కేథడ్రల్ కూడా కేవలం 10–15 నిమిషాల దూరంలో ఉంది అని పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

కొంతమంది ఈ వాదనను తప్పుదారి పట్టించేదిగా పేర్కొన్నారు. ఈ అద్దె దీర్ఘకాలిక లీజుకు కాకపోవచ్చునని, స్వల్పకాలిక లేదా రోజువారీ బుకింగ్ కోసం కావచ్చు, ఇందులో అదనపు సేవా ఛార్జీలు ఉంటాయి. పీక్ సీజన్‌లో ఇది స్వల్పకాలిక అద్దె అని దీపాంషి స్వయంగా అంగీకరించారని కూడా ఒక వినియోగదారు పేర్కొన్నారు. మొత్తానికి దీపాంషి చౌదరి షేర్‌ చేసిన ఈ వీడియో లండన్‌ ప్రజల ఖరీదైన జీవనశైలిని ప్రదర్శిస్తుండగా, సోషల్ మీడియాలో మాత్రం వాస్తవం వర్సెస్ కల్పన అనే చర్చకు దారితీసింది. 8 లక్షల రూపాయల అద్దె వాదన నిజమో కాదో, కానీ, ఇది ఆన్‌లైన్‌లో ప్రజల దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..