AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది బంగారు భూమి..! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా..

బంగారం దాని ప్రకాశం, పెట్టుబడి విలువ, సాంస్కృతిక ప్రాముఖ్యతతో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఈ కథనం బంగారం ధరల పెరుగుదలకు కారణాలు, 'బంగారు భూమి'గా పిలవబడే ఘనా వంటి దేశాల ప్రత్యేకతలు, భారతదేశంలో బంగారం వినియోగం ప్రాధాన్యతను వివరిస్తుంది. దుబాయ్ వంటి అపోహలను తొలగించి, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలపై వెలుగునిస్తుంది.

ఇది బంగారు భూమి..! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా..
Largest Gold Producing
Jyothi Gadda
|

Updated on: Jan 09, 2026 | 2:09 PM

Share

బంగారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహాలలో ఒకటి. దాని ప్రకాశవంతమైన పసుపు మెరుపు ఎప్పుడూ మసకబారదు. అందుకే వేలాది సంవత్సరాలుగా బంగారం విలాసం, రాచరికానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. బంగారం ఇప్పుడు అందం కోసం మాత్రమే కాదు.. మంచి పెట్టుబడి సాధానంగా మారింది. ఒక దేశంలోని బంగారు గనుల సంఖ్యను ఉపయోగించి దాని ఆర్థిక స్థితిని నిర్ణయించవచ్చు. అలాంటివి ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు ఏవి..? బంగారు భూమి అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? ఆ వివరాల్లోకి వెళితే…

భారతదేశంలో బంగారాన్ని ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. అది పెళ్లి అయినా లేదా పండుగ అయినా ప్రతి సందర్భానికీ బంగారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందుకే భారతదేశం అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకుంటారు..కానీ, అది వాస్తవం కాదు.. అక్కడ కొనుగోలు చేయడం చౌకగా ఉంటుంది. కానీ, వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుంది.

ఘనాను బంగారు భూమి అని పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఘనా, దాని విభిన్న బంగారు వనరులు, వృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా జపాన్ లోని సాడో ద్వీపాన్ని కూడా ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవాళ్లు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆ సమయంలో జపాన్ మొత్తం బంగారు ఉత్పత్తిలో దాదాపు సగం ఉత్పత్తి చేసేది. అపారమైన సంపదకు, బంగారానికి నిలయంగా ఉండే ఇండోనేషియాలోని ఒకప్పటి శ్రీవిజయ నగరాన్ని కూడా బంగారు ద్వీపంగా పరిగణించేశాళ్లు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, స్టాక్ మార్కెట్ గందరగోళం బంగారంపై తీవ్రమైన ప్రభావం చూపే అంశాలుగా మారుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడి భావించిన పెట్టుబడిదారులు గోల్డ్‌పై ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఫలితంగా బంగారం ధర క్రమంగా కొత్త శిఖరాలకు చేరుకుంటోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి