AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పక్షి ఈక ఒక్కటి మీ ఇంట్లో ఉంటేచాలు.. ఒక్క బల్లి కూడా ఉండదు..! వెంటనే వెతికి తెచ్చేసుకోండి..

బల్లులు అంటే దాదాపు అందరికీ భయమే.. ఎక్కువగా వంటిల్లు, బాత్‌రూమ్‌లలో బల్లులు కనిపిస్తూ భయపెడుతుంటాయి. చూడటానికి చిన్న జీవులే అయినప్పటికీ, అవి అనేక వ్యాధులకు కూడా కారణమవుతాయి. అలాగే, అవి ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కూడా నమ్ముతారు. మీ ఇంట్లో కూడా బల్లుల బెడద ఎక్కువగా ఉందా..? అలా అయితే, చింతించకండి.. ఇక్కడ ఒక సాధారణ పరిష్కారం ఉంది..దాంతో మీరు ఈజీగా వాటిని తరిమికొట్టొచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

ఈ పక్షి ఈక ఒక్కటి మీ ఇంట్లో ఉంటేచాలు.. ఒక్క బల్లి కూడా ఉండదు..! వెంటనే వెతికి తెచ్చేసుకోండి..
Get Rid Of Lizards Naturally
Jyothi Gadda
|

Updated on: Jan 09, 2026 | 11:45 AM

Share

ఇంట్లో దోమలు, ఈగల బెడద సర్వసాధారణం. అలాగే, చాలా మంది ఇళ్లల్లో బల్లుల బెడద కూడా పెరుగుతోంది. ఇవి ఇంట్లో ప్రతికూలతను కలిగిస్తాయి. అయితే, కొందరు బల్లుల్ని తరిమి కొట్టేందుకు కెమికల్‌ ప్యాడ్లు, స్ప్రేలు, గుడ్డు పొట్టు చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అయితే, ఇవేవీ కాకుండా బల్లులను ఇంట్లోకి రాకుండా ఉంచడానికి ఒక సులభమైన మార్గం ఉంది.. పైగా తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుంది. అవును.. బల్లులు ఒక పక్షిఈకను చూస్తే భయపడతాయి. అది మరేదో కాదు.. నెమలి ఈకలను చూసి బల్లులు పారిపోతాయి. అవి నెమలి ఈకల దగ్గరికి కూడా రావని అంటారు. నెమలి ఈకలంటే బల్లలు భయపడతాయి. దీనికి ఒక కారణం ఉంది. నెమలి ఈకలు బల్లికి పెద్ద కళ్ళు ఉన్న పెద్ద జంతువులా కనిపిస్తాయి. అందుకే బల్లులు భయపడతాయి.

ఇంకా, ఈకల మీద కాంతి పడినప్పుడు అవి మెరుస్తాయి. బల్లులు వాటిని భయంకరమైన జంతువుగా భావిస్తాయి. అందుకే నెమలి ఈకలను చూసినప్పుడు బల్లులు భయపడి పారిపోతాయి. అందుకే నెమలి ఈకలు బల్లులకు సహజ వికర్షకంగా ఉపయోగపడతాయి. మూలలు, కిటికీలు, తలుపులు, అల్మారాల దగ్గర బల్లి ఈకలను ఉంచితే మీరు బల్లులను వదిలించుకోవచ్చు. ఇళ్లలో నెమలి ఈకలను ఉపయోగించడానికి మరొక కారణం వాటి సాంస్కృతిక ప్రాముఖ్యత. అనేక సంస్కృతులలో నెమలి ఈకలను పాములు, కీటకాలు, ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా వికర్షకంగా భావిస్తారు.

ఈ విధంగా ఉపయోగించినట్లయితే, బల్లి సమస్య నుండి బయటపడటానికి నెమలి ఈకలను ప్రముఖ ప్రదేశాలలో ఉంచాలి. అవి ప్రవేశించే కిటికీలు, తలుపుల దగ్గర వాటిని ఉంచాలి. బల్లులు సాధారణంగా కనిపించే వంటగది, అల్మారాలు లేదా మూలల్లో వాటిని ఉంచాలి. అయితే, వీలైనంత వరకు రసాయన స్ప్రేలను వాడకుండా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..