మీకు శని దోషం ఉందా?: శనివారం ఇలా చేస్తే లైఫ్ అంతా ఫుల్ హ్యాపీస్
శని దేవుడు కర్మఫలదాతగా విఖ్యాతి పొందారు. ఆయన అనుగ్రహం లభిస్తే జీవితం క్రమంగా మెరుగుపడి, స్థిరత్వం, మానసిక శాంతి, అభివృద్ధి లభిస్తాయని విశ్వాసం ఉంది. జాతకంలో శని దోషం ఉండటం లేదా శని బలహీన స్థితిలో ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే శని దేవుని కృపను పొందాలంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు కొన్ని నియమాలు, ఆచారాలు పాటించడం శుభప్రదంగా భావిస్తారు.

శనిదేవుడి అనుగ్రహం ఉంటే మీరు మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలు చూస్తారు. అందుకే అందరూ శని దేవుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని, శని బాధల నుంచి బయట పడాలని అనుకుంటారు. శని దేవుడు కర్మఫలదాతగా ప్రసిద్ధి చెందారు. ఆయన అనుగ్రహం లభిస్తే జీవితం క్రమంగా మెరుగుపడి స్థిరత్వం, శాంతి, అభివృద్ధి కలుగుతాయని విశ్వాసం.
జాతకంలో శని దోషం లేదా శని బలహీన స్థితిలో ఉంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే శని దేవుని కృపను పొందాలంటే, శని ప్రభావం తగ్గాలంటే.. శనివారం నాడు కొన్ని నియమాలు పాటించడం శుభప్రదంగా భావిస్తారు.
శనివారం శని దేవుని ఆరాధన
శనివారం నాడు శని దేవుని ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి. నెయ్యితో దీపారాధన చేసి, నల్ల నువ్వులు సమర్పించడం మంచిదిగా చెబుతారు. అలాగే శని మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే శని దోష ప్రభావం తగ్గుతుందని విశ్వాసం.
శనివారం దానధర్మాలు
శనివారం నాడు ఆహారం, వస్త్రాలు, ధనం వంటి వాటిని దానం చేయడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చని భావిస్తారు. ముఖ్యంగా నల్ల వస్త్రాలు, శనగపిండి, నల్ల నువ్వులు, నెయ్యి వంటి వస్తువులను దానం చేయడం శుభప్రదం.
శివుడు, హనుమంతుడి ఆరాధన
శని దోష నివారణకు శివుడు, హనుమంతుడి ఆరాధన ఎంతో ప్రభావవంతమైనదిగా చెబుతారు. శివలింగానికి బిల్వపత్రాలతో అర్చన చేసి, ఆవు పాలను సమర్పించడం మంచిదిగా భావిస్తారు. శనివారం నాడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శని గ్రహ శాంతి కలిగి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
శని దోషం తగ్గేందుకు ఇతర పద్ధతులు
శనివారం నాడు కాకులకు అన్నం లేదా పప్పు పెట్టడం శుభకరం. ఆలయాల్లో నవగ్రహ పూజలు చేయించడం, హనుమాన్ భజనలు, సుందరకాండ పారాయణం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతారు.
అలాగే శనివారం ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉండటం మంచిదిగా భావిస్తారు. ‘ఓం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే శని ప్రభావం తగ్గి, బాధలు తొలగిపోతాయి. అంతేగాక, సానుకూల ఫలితాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం.
Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
