ఆగివున్న రైల్లో మంటలు.. ముంబై విద్యావిహార్-కుర్లా మధ్య ఘటన..రాకపోకలకు అంతరాయం..
ముంబైకి జీవనాడిగా భావించే స్థానిక రైలులో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో అవి చాలా దూరం నుండి కనిపించాయి. ఈ సంఘటన కుర్లా, విద్యావిహార్ స్టేషన్ల మధ్య రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు తెలిపారు. అన్ని సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు.

ముంబైలోని కుర్లాలో శిథిలాల తొలగింపు రైలు బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీని కారణంగా కొంత సమయంపాటు రైలు సేవలకు అంతరాయం కలిగింది. అగ్నిమాపక దళం సకాలంలో స్పందించడంతో వెంటనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంటలు త్వరగా తగ్గిపోవటంతో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
సమాచారం ప్రకారం, ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లోని కుర్లాలో రైల్వే రేక్‌లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా, అప్ స్లో లైన్‌లోని OHE రాత్రి 8:38 నుండి రాత్రి 8:55 వరకు మూసివేయబడింది. మంటలు ఆర్పివేసిన తర్వాత రైలు సేవలు పునరుద్ధరించబడ్డాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు. స్వల్పం అంతరాయం తరువాత అన్ని రైళ్లు సజావుగా నడుస్తున్నాయని చెప్పారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై అధికారుల బృందం దర్యాప్తు చేస్తుంది. శీతాకాలంలో జరిగిన అగ్ని ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
వీడియో ఇక్కడ చూడండి..
Mumbai suburban railway always a happening place. Fire in muck (garbage) rake near Kurla. OHE on Up slow had been shut off between 8:38pm to 8:55pm. Now the fire is doused. No injuries, no damages. All services restored. pic.twitter.com/m5S4JC5j0V
— Rajendra B. Aklekar (@rajtoday) January 8, 2026
కాగా, కుర్లాలోని రైల్వే నెట్‌వర్క్‌లోని శిథిలాల తొలగింపు రైలు బోగీలో మంటలు చెలరేగిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంటల తీవ్రత దృష్ట్యా సమీపంలోని అన్ని రైల్వే ఆపరేటర్‌ను స్విఛాఫ్ చేశారు. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభించబడ్డాయి. ఈ సమయంలో స్థానిక సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సోషల్ మీడియాలో మంటలకు సంబంధించిన వీడియోలు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడం మంచి విషయం అంటున్నారు చాలా మంది నెటిజన్లు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




