సింక్ అవుతున్న గ్లోబల్ సిటీస్.. ప్రమాదంలో ఈ భారత నగరాలు!
ప్రపంచంలో అనేక పెద్ద నగరాలు మెల్లగా నేలలోకి మునిగిపోతున్నాయి, ఇది అంతర్జాతీయ సమస్యగా మారింది. ఇండోనేషియాకు చెందిన జకార్తా అత్యంత ప్రభావిత నగరంగా ఉంది. భూగర్భ జలాల అధిక వినియోగం, భారీ నిర్మాణాలు, అతి భారీ వర్షాలు దీనికి ప్రధాన కారణాలు. భారత్‌లో చెన్నై, కోల్‌కతా వంటి నగరాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి.

ప్రపంచంలోని అనేక పెద్ద పెద్ద నగరాలు మెల్ల మెల్లగా నేలలోకి దిగబడుతున్నాయి. ఇప్పుడు ఇది ఒక ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. ఇండోనేషియా రాజధాని జకార్తా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన నగరంగా చెప్పవచ్చు. ఈ నగరం ఇప్పటికే సముద్ర మట్టానికి దిగువకు రావడం గమనార్హం. భూగర్భ జలాలను అధికంగా వాడుకోవడం, భారీ నిర్మాణాలు, అతి భారీ వర్షాలు ఈ నగరాన్ని ముంచేలా చేస్తున్నాయని తాజా అధ్యయనం తేల్చింది.
భారతదేశంలోని చెన్నై, కోల్‌కతా వంటి నగరాలు కూడా ఇందులో చోటు దక్కించుకున్నాయి. ఈ సమాచారం సింగపూర్ నాన్యంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్ వంటి ఐదు పెద్ద భారత నగరాలు అధికంగా భూమిలోకి జారుకునే సమస్యను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలను ఎక్కువగా దుర్వినియోగం చేయడం కారణంగానే ఈ నగరాలలో భూమి కుంగిపోతోందని అధ్యయనం చెబుతోంది.
భూమిలోకి కుంగిపోతున్న కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్
కోల్‌కతా నగరం ప్రతీ సంవత్సరం 2.8 సెంటిమీటర్లు కుంగిపోతుండగా.. తమిళనాడు రాజధాని చెన్నై ప్రతి ఏడాది 3 సెంటిమీటర్లకుపైగా నేల సింక్ అవుతోందని అధ్యయనం చెబుతోంది. ఇక అహ్మదాబాద్ నగరం ప్రతి సంవత్సరం 4 సెంటిమీటర్లు కుంగిపోతుంది. ఈ నగరాల్లో మొత్తం సుమారు 878 చదరపు కిలోమీటర్లు భూమి మెల్లగా నేలలోకి దిగబడుతోందని అధ్యయనంలో వెల్లడించారు. గుజరాత్ ప్రాంతం ఎక్కువగా వరదలకు గురయ్యే అవకాశం హెచ్చరిస్తున్నారు.
తీవ్ర పరిణామాలు
భూమి కుంగిపోవడం వల్ల లక్షలాది లక్షల మంది ప్రజల నివాస ప్రాంతాల్లో భూభాగం స్థిరత్వం కోల్పోవచ్చని చెబుతోంది. భూగర్భ జలాలను ఎక్కువగా డ్రిల్ చేసి వినియోగించడం వల్ల నేలలోని మట్టిపై పీడనం పెరుగుతుంది. దీంతో నేల తన ఆవిర్భవాన్ని కోల్పోతూ మెల్లగా కిందకి దిగుతోంది. ఇది భవనాలు, మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది.
ఉత్తరకొరియాలోకి సముద్రం
అంతేకాదు, సముద్ర మట్టాలు పెరుగుతున్న కారణంగా కూడా సముద్రతిర ప్రాంతాలు, మరింత ప్రమాదంలోకి వెళుతున్నాయి. రానున్న కొంత కాలంలో సముద్రం పెరుగుతూ ఉత్తరకొరియా వంటి ప్రాంతాలలోపలికి ప్రవేశించే ప్రమాదం కూడా ఎదురవుతోందని వాతావరణ మార్పుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్చరిక
ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నగరాల నీటి వినియోగ పద్ధతులు, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై కొత్త పాఠాలను సూచిస్తున్నాయి. నగరాల ప్రజలు, పాలకులు తదితరులు త్వరగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలను అరికట్టేందుకు భూగర్భ నీటిని అధికంగా వినియోగించడం తగ్గించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
