AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్‌వెజ్‌ ప్రియులకు ఇష్టమైన ఫిష్‌కర్రీ..ఈ చేపల టేస్టేవేరు…! ఒక్కసారి రుచి చూశారంటే..

జెర్రీ చేపలు హిందూ మహాసముద్ర తీరప్రాంతాల్లో లభించే అరుదైన చేపలు. వీటి పదునైన దంతాలు, పొడవైన దవడ ప్రత్యేకత. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఈ చేపలు గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు చాలా మంచివి. రోగనిరోధక శక్తిని పెంచి, సంపూర్ణ శారీరక ఆరోగ్యానికి ఇవి ఎంతో సహాయపడతాయి. వారానికి 2-3 సార్లు తీసుకోవడం ఉత్తమం.

నాన్‌వెజ్‌ ప్రియులకు ఇష్టమైన ఫిష్‌కర్రీ..ఈ చేపల టేస్టేవేరు...! ఒక్కసారి రుచి చూశారంటే..
Jerry Fish Benefits
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2026 | 2:01 PM

Share

నాన్‌వెజ్‌ ప్రియులకు చికెన్‌, మటన్‌ తరువాత ఫిష్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. మరికొందరు రోజూ చేపలు రోజూ పెట్టినా తింటూనే ఉంటారు. చేపలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇవి ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఆరోగ్యవంతమైన శరీరం, అందంతో సంపూర్ణ ఆరోగ్యానికి చేపలు మంచి ఆహారం. అందుకే వారానికి 2-3 సార్లు చేపలు తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మెదడు పనితీరు బావుంటుంది. అయితే, ఈ చేపల్లో చాలా రకాలు ఉంటాయి. కానీ, మీరు ఎప్పుడైనా జెర్రీ చేపల గురించి విన్నారా..

అవును చేపల్లో ఒకటి జెర్రీ చేప రకం. వీటి దంతాలు చాల పదునుగా ఉంది, లేత తెలుపు రంగులో ఉంటాయి. చూసేందుకు సన్నగా ఉంటుంది. ఈ చేపకు కింద దవడ పొడవుగా ఉంటుంది. సూదిగా ఉండే పొడవాటి నోటి భాగాన్ని కలిగి ఉంటుంది. ఈ చేపలు ప్రధానంగా హిందూ మహాసముద్రం పరిధిలోని తీర ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. అన్ని సీజన్లలోనూ దొరుకుతాయి. జెర్రీ చేపలు సాధారణ చేపల మాదిరికాదు.. వాటి ఆహారం సముద్రరొయ్యలు, కీటకాలు, చిన్న చేపలను తింటాయి. ఈ క్రమంలోనే ఆహారం కోసం వెతుక్కుంటూ రాత్రివేళల్లో నీటి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి.

ఈ జెర్రీ చేప రుచి తో పాటు అధిక పోషకాలు ఉంటాయి. దీనిలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.