Nalla Thumma Chettu : ఈ చెట్టును గుర్తుపట్టారా..? కంప కాదు.. ఒంటి నిండా ఔషధాల పుట్ట..!
నల్ల తుమ్మ చెట్టు ఆయుర్వేదంలో విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. దీని బెరడు, జిగురు, కాయలు, ఆకులను ఉపయోగించి అనేక వ్యాధులకు చికిత్స చేస్తారు. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, మహిళల్లో నెలసరి సమస్యలు, మగవారి ఆరోగ్యానికి, నోటి సంబంధిత సమస్యలకు నల్ల తుమ్మ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ ప్రాచీన మూలికలోని ఔషధ గుణాలను తెలుసుకుని, వాటి ప్రయోజనాలను పొందండి.

నల్ల తుమ్మ.. నేటి తరానికి ఈ చెట్టు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ, గ్రామాల్లో ఉన్నవారికి తప్పక తెలిసే ఉంటుంది. ఈ చెట్టు కాయలు మేకలు, పశువులకు ఆహారంగా పెడతారు. పసుపు రంగులో చిన్నసైజు బంతుల్లా పూలు పూస్తుంది. కానీ, చెట్టు నిండా పొడవాటి ముల్లు కూడా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ నల్ల తుమ్మకు విశేషమైన స్థానం ఉంది. దీంతో మన శరీరానికి పనికొచ్చే పలు వ్యాధులకు మందు తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. నల్ల తుమ్మలోని ఔషధ గుణాలు, ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
నిపుణులు ప్రకారం.. ఈ నల్ల తుమ్మ బెరడు, జిగురు, కాయలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటన్నింటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ప్రతిరోజూ మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో వెన్ను నొప్పి దూరం చేసుకోవచ్చు. అలాగే నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాల్లలో కలుపుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు.
ఆయుర్వేదంలో నల్ల తుమ్మ చెట్టు ఆకులను జ్యూస్ గా చేసి కూడా మహిళలకు ఔషధంగా ఇస్తారు. దీంతో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. తుమ్మకాయలను ఎండబెట్టి పొడిగా చేసి, తగినన్ని నీళ్లు, కండ చక్కెరను కలిపి తీసుకుంటే… మగవారికి మంచిదట. నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించటం వల్ల నోటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గ్రామాల్లో చేలకు కంచెలు ఏర్పాటు చేసేందుకు కూడా వాడుతుంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.




