AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పెద్ద కళ్ల మహిళ ఎవరో తెలుసా? ఎక్కడ కొత్త నిర్మాణం జరిగినా తన ఫోటోలే వైరల్..అసలు మ్యాటర్‌ ఇదే..!

సోషల్ మీడియాలో ఓ మహిళ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగులు, పొలాలు, దుకాణాలు ఇలా ప్రతి చోట ఆమె ఫోటోలే దర్శనమిస్తున్నాయి.. ఆ ఫోటోలో ఉన్నఆ మహిళ చాలా కోపంగా ఉన్న ముఖంతో, చాలా పెద్ద కళ్ళతో చూస్తోంది. నుదిటిపై ఎర్రటి బొట్టు, పాపిట సింధూరం, చక్కటి చీర కట్టులో ఉన్న ఆ మహిళ ఫోటోను చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఇంతకీ సదరు మహిళ ఎవరు..? అసలు మ్యాటర్ ఏంటో ఇక్కడ చూద్దాం...

ఈ పెద్ద కళ్ల మహిళ ఎవరో తెలుసా? ఎక్కడ కొత్త నిర్మాణం జరిగినా తన ఫోటోలే వైరల్..అసలు మ్యాటర్‌ ఇదే..!
Mystery Woman
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2026 | 11:47 AM

Share

వివిధ నగరాల్లో చాలా వింతలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలు ఈ విషయాలను వింతగా భావిస్తారు. కానీ, ఈ వింతల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. బెంగళూరులో నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక యువతి కూడా బెంగళూరులో ఇలాంటి వింతలను చూసింది. ఆమె దాని గురించి నేరుగా Xలో పోస్ట్ చేసింది. ఆమె తను చూసిన విషయాల వెనుక ఉన్న ఇంకా వింతను ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేసింది. దాంతో అది కాస్త నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఏంటా వింత సంఘటన తెలుసుకుందాం…

@unitechy అనే ఖాతా నుండి ఒక ఫోటో పోస్ట్ చేయబడింది. ఈ ఫోటోలో నిర్మాణంలో ఉన్న భవనంపై ఒక మహిళ ఫోటోను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో ఎక్కడ చూసినా ఓ మహిళ ఫొటో కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగులు, పొలాలు, దుకాణాలు ఇలా ప్రతి చోట ఆమె ఫోటోలు దిష్టి బొమ్మగా పెడుతున్నారు. ఆ ఫోటోలో ఉన్నఆ మహిళ చాలా కోపంగా ఉన్న ముఖంతో, చాలా పెద్ద కళ్ళతో చూస్తోంది. నుదిటిపై ఎర్రటి బొట్టు, పాపిట సింధూరం, చక్కటి చీర కట్టులో ఉన్న ఆ మహిళ ఫోటోను చూస్తే ఎవరైనా షాక్ అవుతారు.

బెంగళూరులోని అనేక నిర్మాణంలో ఉన్న భవనాలపై ఇప్పుడు ఇలాంటి ఫోటోలే కనిపిస్తున్నాయి. దీంతో ఆ మహిళ ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ పెట్టిన వెంటనే చాలా మంది దానిపై వ్యాఖ్యానించారు.

వైరల్ ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారికా రావు అని, కర్ణాటకకు చెందిన యూట్యూబర్‌ కొందరు పేర్కొన్నారు. 2023లో ఓ వీడియో క్లిప్‌ నుంచి తీసుకున్నదే ఆ లుక్ అని కొందరు యూజర్లు పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..