Home Tips: సగం నిమ్మకాయ మంత్రంతో మీ వంటింట్లో దగదగలే..! నిమిషాల్లో మరకలన్నీ మాయం..
దాదాపు ప్రతి ఇంట్లో మైక్రోవేవ్‌లను ఉపయోగిస్తారు. రోజువారీ వాడకం వల్ల వాటిపై ఆహార మరకలు పడి వికారంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే, వదిలేస్తే ఆరోగ్యానికి హానికరం కూడా. అలాగే, టీ స్ట్రైనర్‌లను కూడా క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. దీనివల్ల మురికి పేరుకుపోతుంది. శుభ్రం చేయడం కష్టం. అందువల్ల ఈ రోజు మనం సగం కట్ చేసిన నిమ్మకాయను ఉపయోగించి మీ మైక్రోవేవ్, టీ స్ట్రైనర్‌ను సులభంగా శుభ్రం చేయడానికి అద్భుతమైన ఉపాయం ఉంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

నిమ్మకాయ ఆహార రుచిని పెంచడమే కాకుండా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవటం వల్ల అనేక శారీరక సమస్యలను తగ్గిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ, నిమ్మకాయతో మీ వంటింటిని కూడా బాగు చేసుకోవచ్చునని మీకు తెలుసా..? అవును, నిమ్మకాయ కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అనేక విధాలుగా క్లీనింగ్ విధానంలో కూడా అద్భతంగా పనిచేస్తుంది. వంటింట్లోని మైక్రోవేవ్‌లు, టీ స్ట్రైనర్‌లను నిమ్మకాయతో క్లీన్ చేయటం వల్ల అవి కొత్తవాటిలా మెరిసిపోతాయి. అదేలాగో ఇక్కడ చూద్దాం…
దాదాపు ప్రతి ఇంట్లో మైక్రోవేవ్‌లను ఉపయోగిస్తారు. రోజువారీ వాడకం వల్ల వాటిపై ఆహార మరకలు పడి వికారంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే, వదిలేస్తే ఆరోగ్యానికి హానికరం కూడా. అలాగే, టీ స్ట్రైనర్‌లను కూడా క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. దీనివల్ల మురికి పేరుకుపోతుంది. శుభ్రం చేయడం కష్టం. అందువల్ల ఈ రోజు మనం సగం కట్ చేసిన నిమ్మకాయను ఉపయోగించి మీ మైక్రోవేవ్, టీ స్ట్రైనర్‌ను సులభంగా శుభ్రం చేయడానికి అద్భుతమైన ఉపాయం ఉంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం..
టీ స్ట్రైనర్‌ను నిమ్మకాయతో శుభ్రం చేయడం ఎలాగంటే…
టీ స్ట్రైనర్ నుండి మరకలను తొలగించడానికి ముందుగా బేకింగ్ సోడాను నేరుగా స్ట్రైనర్‌పై చల్లుకోవాలి. తరువాత, నిమ్మకాయను సగానికి కోసి, దాని రసం కలిపి, పాత టూత్ బ్రష్‌తో మెల్లగా స్క్రబ్ చేయండి. ఇప్పుడు 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. తరువాత, ఒక పాత్రలో నీటిని వేడి చేసి, డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి, టీ స్ట్రైనర్‌ను అందులో ముంచండి. 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత, స్ట్రైనర్‌ను తీసివేసి, స్క్రబ్ చేసి శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇది నిమిషాల్లో స్ట్రైనర్‌ను కొత్తగా మెరిసేలా చేస్తుంది.
మైక్రోవేవ్‌ను ఎలా శుభ్రం చేయాలి?
నిమ్మకాయతో మైక్రోవేవ్ మరకలను శుభ్రం చేయడం కూడా చాలా సులభం. దీని కోసం ఒక గిన్నె నీటిని తీసుకొని సగం కోసిన నిమ్మకాయ తొక్కతో సహా వేయాలి. మైక్రోవేవ్‌లో 2-3 నిమిషాలు వేడి చేసి, ఆపై మరో రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఓవెన్ డోర్ ఓపెన్ చేసి ఏదైనా మురికి, మరకలు ఉంటే టిష్యూతో తుడిచేసుకోవాలి. లోపల నీటి ఆవిరితో లోపల పేరుకుపోయిన మురికి, ఆయిల్ మరకలు వదిలిపోతాయి. శుభ్రపరచడం చాలా సులభం చేస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
నిమ్మకాయ అన్ని రకాల వాసనలను తొలగించడానికి సహాయపడుతుంది. మైక్రోవేవ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, పాత ఆహార మరకలు గట్టిపడతాయి. వాసన రావడం మొదలవుతుంది. అంతేకాదు. అలాగే వదిలేస్తే లోపల బ్యాక్టీరియా పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఇవి ఆరోగ్యానికి హానికరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..