ప్రతిరోజూ టమోటా తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోవాలి..లేదంటే..
టమోటాలతో ప్రత్యేక సూప్‌లు, సాస్‌లు, చట్నీలను కూడా తయారు చేస్తారు. వంటల రుచిని పెంచే ఈ జ్యుసి టమాటాలు పోషకమైన ఆహారంగా పనిచేస్తాయి. మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కానీ, ప్రతిరోజూ టమోటాలు తినడం వల్ల మీ శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

అన్ని కూరగాయల్లో కెల్లా టమాటాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే.. వంట ఏదైనా సరే.. టమాటా లేనిదే అసంపూర్ణం అని చెప్పాలి. వివిధ రకాల కూరగాయలు, సలాడ్‌లతో సహా అనేక వంటలలో ఉపయోగిస్తారు. టమోటాలతో ప్రత్యేక సూప్‌లు, సాస్‌లు, చట్నీలను కూడా తయారు చేస్తారు. వంటల రుచిని పెంచే ఈ జ్యుసి టమాటాలు పోషకమైన ఆహారంగా పనిచేస్తాయి. మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కానీ, ప్రతిరోజూ టమోటాలు తినడం వల్ల మీ శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..
విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం, చర్మం, జీర్ణవ్యవస్థకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. రోజూ పచ్చి టమాటా తింటే బీపీ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. టమాటాలో విటిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి ఇది చాలా కీలకం.
టమాటా యాంటీ ఆక్సిడెంట్ లా కూడా పని చేస్తుంది. బాడీ సెల్స్ డ్యామేజ్ కాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. స్కిన్ ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. టమాటాతో జీర్ణ శక్తి పెరుగుతుంది. అందుకు కారణం ఏంటంటే..టమాటాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. టమాటాలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. బ్లడ్ క్లాటింగ్ లేకుండా చూస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




