తాటి బెల్లం అంటే తమాషా అనుకోకండోయ్…ఆ సమస్యలన్నీ మడతపెట్టేస్తుంది..!
తాటి బెల్లం కేవలం రుచికే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. ఇది జీవక్రియలను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, దగ్గును తగ్గిస్తుంది. ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండే తాటి బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది. మహిళల నెలసరి నొప్పులను తగ్గించి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

సాధారణంగా అందరూ చెరుకు నుండి తీసిన బెల్లం ఎక్కువగా వాడుతుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా తాటి బెల్లం ట్రై చేశారా..? దీని ప్రయోజనాలు తెలిస్తే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని మరీ తెచ్చుకు తింటారు. అంతటి పవర్‌ఫుల్ బెనిఫిట్స్ కలిగి ఉంది తాటిబెల్లం. బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే తాటి బెల్లాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియలను వేగవంతం చేసి శరీర బరువును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లాన్ని రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు సమస్యలకు బాగా పనిచేస్తుంది.
తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి, వికారం, తిమ్మిర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఇందుకు తోడ్పడుతాయి. తాటి బెల్లంలో కాల్షియం, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తాటి బెల్లంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికలు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. భోజనం చేసిన వెంటనే ఒక ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. చర్మానికి కూడా తాటిబెల్లం ఎంతో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




