AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుమ్మడి గింజలా మజాకా..? రోజూ రెండు స్పూన్లు తిన్నారంటే..ఈ భయంకర సమస్యలు బలదూర్..!

నిద్రలేమికి కూడ ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. గుమ్మడి గింజలు శరీర శక్తిని పెంచుతుంది. అప్పుడు మీరు కొత్త ఉత్సాహంతో పని చేయగలుగుతారు. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గుమ్మడి గింజలా మజాకా..? రోజూ రెండు స్పూన్లు తిన్నారంటే..ఈ  భయంకర సమస్యలు బలదూర్..!
Pumpkin Seeds
Jyothi Gadda
|

Updated on: Jan 06, 2026 | 1:45 PM

Share

గుమ్మడికాయ.. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సందర్బంలో తప్పనిసరిగా చూసి, ఉపయోగించి ఉంటారు.. ముఖ్యంగా పండుగల సమయంలో ఇల్లు, ఆఫీసులు, వ్యాపారలకు దిష్టి తీసేందుకు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే, దిష్టి తగల కుండా పసుపు, కుంకుమలతో అలంకరించి ఎదురుగా ఇల్లు,ఆఫీసుల బయట రూఫ్‌కి కడుతుంటారు. అలాటే, కొందరు రకరకాలుగా వండుకుని తింటారు. కూర, సాంబార్‌, స్వీట్స్‌ ఇలా చాలా వెరైటీలు తయారు చేస్తారు. అయితే, ఈ సారి మీరు గుమ్మడికాయను కోసినప్పుడు దాని విత్తనాలు కనిపిస్తే వదలకండి. అవేవో పనికిరాని చెత్తగా భావించి చెత్తబుట్టలో వేసారంటే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే.. ఈ విత్తనాలు అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య సిరులు అంటున్నారు ఆయుర్వేదా పోషకాహార నిపుణులు. ఆయా లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. చాలా మంది గుమ్మడి కూర, చారు, జ్యూస్‌ రూపంలో విరివిగా తీసుకుంటూ ఉన్నారు. అయితే, గుమ్మడి కాయ మాదిరిగానే గుమ్మడి గింజలు కూడా పుష్కలమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వాటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, విటమిన్ సి, విటమిన్ కె, భాస్వరం, మాంగనీస్, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గుండె సమస్యలకు గుమ్మడి గింజలు చక్కటి పరిష్కారం అంటున్నారు పోషకాహార నిపుణులు. గుమ్మడికాయ గింజల్లో ఉండే మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రతిరోజూ సుమారు 2 గ్రాముల గుమ్మడికాయ గింజలను తినమని చెబుతున్నారు. వీటిలో ఉండే పొటాషియం, ఫైబర్, విటమిన్ సి మన హృదయాలను ప్రమాదం నుండి రక్షిస్తాయి. అలాగే, వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు చాలా ఇబ్బందికరంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

గుమ్మడి గింజలు ఆర్థరైటిస్ నుండి ఉపశమనం పొందడానికి పనిచేస్తాయి. నొప్పి నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు… నిద్రలేమికి కూడ ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. గుమ్మడి గింజలు శరీర శక్తిని పెంచుతుంది. అప్పుడు మీరు కొత్త ఉత్సాహంతో పని చేయగలుగుతారు. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..