Amaravati: అమరావతి నిర్మాణ పనులు వేగవంతం.. కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సులకు CRDA ఆమోదం..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 58వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా CRDA కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సబ్‌కమిటీ చేసిన వివిధ సిఫార్సులకు CRDA ఆమోదం తెలిపింది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 58వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా CRDA కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సబ్‌కమిటీ చేసిన వివిధ సిఫార్సులకు CRDA ఆమోదం తెలిపింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ సంస్థలకు స్థల కేటాయింపులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పలు ప్రముఖ బ్యాంకులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు అమరావతిలో BJP రాష్ట్ర కార్యాలయానికి స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఇక రాజధానిలో అత్యంత కీలకమైన హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నింటినీ మంజూరు చేశారు. పనులు AGICLకు బదిలీ చేస్తూ CRDA నిర్ణయం తీసుకుంది.
ప్రధానంగా రాజధానిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణంతో పాటు, పర్యావరణానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన ‘గ్రీన్ అండ్ బ్లూ’ డిజైన్లపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నగరం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, ఇక్కడ ఏర్పాటు చేసే పార్కులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు.
ఇందుకోసం ఇతర దేశాల్లో ఉన్న పార్కులపై ప్రత్యేక అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతికతను, ప్రకృతి సౌందర్యాన్ని జోడించి రాజధాని రూపురేఖలను మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
