AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi: సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసిందిగా

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక సమస్యలపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మహిళల సమస్యల సామాజిక మాధ్యమాల వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటుంది చిన్మయి. అయితే తాజాగా ఒక నెటిజన్ ఆమెపై దారుణమైన కామెంట్స్ చేశాడు.

Chinmayi: సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసిందిగా
Chinmayi Sripaada
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 7:11 AM

Share

సింగర్ చిన్మయి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సామాజిక సమస్యలపై తన దైన శైలిలో స్పందిస్తుంటుందామె. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటుంది. కొన్ని సార్లు తన పోస్టులు, కామెంట్స్ పై ట్రోలింగ్ జరిగినా ఆమె వెనక్కితగ్గదు. ఇదే క్రమంలో కొందరు నెటిజన్లు పని గట్టుకుని చిన్మయిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా తిడుతున్నారు. అలా తాజాగా ఒక నెటిజన్ చిన్మయి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్ స్టీన్ కుంభ కోణం ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తోంది. ఇందులో ఎప్ స్టీన్ చేసిన ఉదంతాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఈ క్రమంలో చిన్మయి కూడా ఎప్ స్టీన్ స్కాండల్ ను గుర్తు చేస్తూ అందరినీ హెచ్చరించింది. ‘ప్రతి ఇంట్లోనూ ఎప్ స్టీన్‌లు ఉంటారు. మత పెద్దలను కూడా గుడ్డిగా నమ్మకండి. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారు. మీకు తెలిసిన ఏ అమ్మాయినైనా అడగండి.. ఆమె మొదటిసారి ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైందో చెబుతుంది’ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది చిన్మయి.

చిన్మయి పోస్ట్‌పై స్పందించిన ఒక నెటిజన్ దారుణంగా కామెంట్స్ చేశాడు.. ‘నీ తండ్రే నిన్ను రేప్ చేసి ఉంటాడు.. అందుకే ఇలా మాట్లాడుతున్నావు’ అంటూ చీప్ కామెంట్స్ పెట్టాడు. దీనిపై చిన్మయి కూడా ధీటుగా స్పందించింది. ‘నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు.. కానీ కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఊహిస్తున్నారంటే.. మీ సంస్కృతి ఏంటో, మీరు పెరిగిన వాతావరణం ఏంటో అర్థమవుతోంది. మిమ్మల్ని పెంచిన విధానం మీ బిహేవియర్ లో కనిపిస్తోంది’ అంటూ సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు చిన్మయి శ్రీపాదకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు