AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG TRANSCO Jobs 2026: తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు

తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన టీజీ ట్రాన్స్‌కో.. హైదరాబాద్‌లోని తన కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1973 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో..

TG TRANSCO Jobs 2026: తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
TGTRANSCO
Srilakshmi C
|

Updated on: Feb 22, 2026 | 6:50 AM

Share

నిరుద్యోగులకు తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గుడ్‌న్యూస్ చెప్పింది. టీజీ ట్రాన్స్‌కోకి చెందిన హైదరాబాద్‌లోని కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1973 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు 125, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టులు 125 వరకు ఉన్నాయి.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, సివిల్ లేదా ఐటీ విభాగాల్లో ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్‌సీ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 27, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. అలాగే దరఖాస్తు రుసుము కూడా చెల్లించవల్సిన అవసరం లేదు. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటీస్‌ శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.17,500, డిప్లొమా అప్రెంటీస్‌ పోస్టులకు నెలకు రూ.15,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 20, 2026.
  • NATS పోర్టల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2026.
  • తెలంగాణ ట్రాన్స్‌కోలో దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2026.

తెలంగాణ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ NATS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?
రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
శరీరాన్ని ట్రాక్ లోకి తెచ్చే ‘సర్క్యూట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్’
శరీరాన్ని ట్రాక్ లోకి తెచ్చే ‘సర్క్యూట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్’