AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఆ సమస్యలకు చూమంత్రం వేసినట్టే!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యల భారీన పడతున్నారు. వాటిలో పంటి నొప్పి, మోకాలు, పాదాల నొప్పి మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వీటిని నయం చేసేకునేందకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేక మందులను వాడుతూ ఉంటారు. కానీ అవి పూర్తి పరిష్కారాన్ని అందిచవు. కాబట్టి ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని వస్తువులతో మీరు ఈ నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే మీ కండరాలను బలంగా మార్చుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

Health Tips: ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఆ సమస్యలకు చూమంత్రం వేసినట్టే!
Ragi Laddu Recipe
Anand T
|

Updated on: Feb 22, 2026 | 7:00 AM

Share

కండరాల బలోపేతానికి, నొప్పుల నివారణకు రాగులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. భారతదేశంలో చాలా సులభంగా లభించే ఈ ధాన్యం మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని జనాలు అనేక రకాలు తమ ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. కొందరు ఈ రాగులతో రొట్టెలు చేసుకుంటే, మరికొదరు జావాలా చేసుకొని తాగుతారు. మరికొందరు రాగి ముద్దలు చేసుకొని తింటారు.కొందరు ఇడ్లీల్లా తింటారు. అయితే తరచూ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారు. ఈ రాగులతో లడ్డూలు చేసుకొని వాటిని నిల్వ చేసుకొని తినడం ఉత్తమమైన ఎంపిక.

రాగి లడ్డూ ప్రయోజనాలు

రాగి లడ్డు చాలా ఆరోగ్యకరమైన స్నాక్. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో బెల్లం కడపడం ద్వారా సహజ తీపి, మరిన్ని ప్రయోజనాలు పెరుగుతాయి. రోజుకు 1-2 లడ్డూలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎముకలు, దంతాలు బలపడతాయి, రక్తహీనత తగ్గుతుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగవుతాయి.

రాగి లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు.

ఈ రాగి లడ్డూను తయారు చేసుకోవడానికి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. దీనికి పెద్దగా సమాగ్రి కూడా అవసరం లేదు. 1 కప్పు జొన్న (సన్నగా రుబ్బినది), 1 కప్పు బెల్లం , 1/4 కప్పు నెయ్యి 1 , టేబుల్ స్పూన్ ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బాదం, కాజు 2-3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి 2-3 టేబుల్ స్పూన్లు ఉంటే సరిపోతుంది.

రాగి లడ్డూ తయారీ విదానం

ఒక మందపాటి పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, రాగి పిండి వేసి చిన్న మంట మీద నెమ్మదిగా వేయించండి. దాన్ని నిరంతరం కలుపుతూ ఉండండి. మంచి వాసన వచ్చి, రంగు కొద్దిగా మారినప్పుడు ఆపేయండి. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వండి. తర్వాత అదే పాన్‌లో కొద్దిగా నెయ్యిలో వేరుశెనగలు, బాదం, కాజు ముక్కలు వేసి లైట్‌గా వేగనివ్వండి. ఎండు కొబ్బరి కూడా వేసి 1-2 నిమిషాలు వేయించి, చల్లారనివ్వండి.

తర్వాత బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో పొడి చేసుకోండి. కొందరు బెల్లం సిరప్‌గా కరిగించి వాడతారు కానీ పొడి వాడితే సులభం ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేయించిన రాగి పిండి, బెల్లం పొడి, ఏలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేడి చేసి చేతితో బాగా కలపండి. తర్వాత ఆ మిశ్రమాన్ని చేతితో లడ్డూలా తయారు చేయండి. దీన్ని మీ పిల్లలకు ప్రతిరోజూ ఇస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది. వారికి దంతాలు లేదా కీళ్ల నొప్పులు కూడా ఉండవు. రాగి ఉత్పత్తులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us