Sunflower Seeds: రోజు ఒక స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు తింటే చాలు.. సూపర్ బెనిఫిట్స్.. ముఖ్యంగా వారికి..
మహిళల హార్మోన్ల సమతుల్యత, ఋతుక్రమ నొప్పుల ఉపశమనానికి పొద్దుతిరుగుడు విత్తనాలు అద్భుత ఔషధం. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చిరాకు, కోపాన్ని తగ్గించి, క్యాన్సర్, గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఎముకల బలోపేతానికి, డయాబెటిస్ నియంత్రణకు కూడా సహాయపడతాయి.

మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యతలో అనేక హెచ్చుతగ్గులు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ మార్పులు వారిని చాలా ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా వారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మహిళలు తరచుగా చిరాకుగా కనిపిస్తుంటారు. చిన్న విషయాలకే కోపంగా ఉండటం ప్రారంభిస్తారు. దీంతో పాటు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు, వెన్నునొప్పి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మహిళలకు ఎక్కువ రోజుల ముందుగానే పీరియడ్స్ నొప్పులు రావడం ప్రారంభిస్తాయి.. అలాంటి మహిళలు సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలియక చాలా ఆందోళన చెందుతారు. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..అటువంటి పరిస్థితుల్లో కొన్ని విత్తనాలు మీకు ఆరోగ్యానిస్తాయి. అందులో ఒకటి పొద్దుతిరుగుడు. ఈ విత్తనాల ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం…
పొద్దుతిరుగుడు విత్తనాలు చాలా శక్తివంతమైనవి. దీనిలో ప్రోటీన్, కొవ్వు మంచి పరిమాణంలో ఉంటుంది. అంతేకాదు.. అనేక రకాల విటమిన్లు, జింక్, మాంగనీస్, రాగి, మెగ్నీషియం, ఇనుము, పాంతోతేనిక్ ఆమ్లం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఇతర విత్తనాల కంటే ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు..క్యాన్సర్‌ను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవాలి. ఇది ఎముకలను బలపరుస్తుంది. కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విత్తనంలో సరైన మొత్తంలో అయోడిన్, సెలీనియం ఉంటాయి. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను సమతుల్యం చేస్తుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ E, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక రకాల క్యాన్సర్‌ల నుండి రక్షించుకోవచ్చు. ఈ విత్తనాల్లోని విటమిన్ E క్యాన్సర్ నిరోధకమే కాకుండా గుండెను బలంగా చేయడంలో కూడా చాలా శక్తివంతమైనది. ఇది గుండె నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ట్రైగ్లిజరైడ్‌లను కూడా తగ్గిస్తుంది. గుండెలో మంటను నివారిస్తుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలలో అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. వాటిలో మెగ్నీషియం, పాంటోథెనిక్ ఆమ్లం ఉన్నాయి. ఇవి కండరాల నొప్పులను తగ్గిస్తాయి. అందువల్ల, కండరాల సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇది శరీరం నుండి ఆక్సీకరణ ఒత్తిడిని తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




