Money Plant Care Tips: మీ అదృష్ట మొక్క చలికి వాడిపోతుందా? ఇలా చేస్తే మనీ ప్లాంట్ ఏపుగా, గుబురుగా పెరుగుతుంది..!
మనీ ప్లాంట్ ఉష్ణమండల మొక్క. కాబట్టి నష్టాన్ని నివారించడానికి శీతాకాలంలో దీనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్‌లో చలి ఎక్కువగా ఉండటం, తగినంత సూర్యరశ్మి లేకపోవడం, వల్ల మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. దీనివల్ల మొక్క నిర్జీవంగా వాడిపోయినట్టుగా కనిపిస్తుంది. క్రమంగా తీగ ఎండిపోతుంది. అయితే, ఈ ఆకుల పచ్చదనాన్నిపెంచేందుకు మీరు కొన్ని సాధారణ ఇంటి చిట్కాలను పాటిస్తే సరి.

చాలా మంది ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు కోసం మనీ ప్లాంట్లను పెంచుతారు. కానీ సరైన సంరక్షణ లేకపోవడం వల్ల వాటి ఆకులు చలికాలంలో పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. మనీ ప్లాంట్ ఉష్ణమండల మొక్క. కాబట్టి నష్టాన్ని నివారించడానికి శీతాకాలంలో దీనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్‌లో చలి ఎక్కువగా ఉండటం, తగినంత సూర్యరశ్మి లేకపోవడం, వల్ల మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. దీనివల్ల మొక్క నిర్జీవంగా వాడిపోయినట్టుగా కనిపిస్తుంది. క్రమంగా తీగ ఎండిపోతుంది. అయితే, ఈ ఆకుల పచ్చదనాన్నిపెంచేందుకు మీరు కొన్ని సాధారణ ఇంటి చిట్కాలను పాటిస్తే..దీనిని మీరు సరైన సమయంలో సరిగ్గా పాటిస్తే..మీ మనీ ప్లాంట్ సహజ మెరుపు, పచ్చదనాన్ని తిరిగి తీసుకురావొచ్చు.
శీతాకాలంలో మీ మనీ ప్లాంట్ వాడిపోకుండా ఉండాలంటే.. మీరు ఒక సింపుల్, ఎఫెక్టివ్ హోం రెమిడీని ట్రై చేయండి. ఇందుకోసం బొగ్గు, బూడిద, బేకింగ్ సోడా మిశ్రమం మీ మొక్కను పునరుజ్జీవింపజేస్తుంది. బొగ్గు బూడిద నేలను పోషకాలతో సుసంపన్నం చేస్తుంది. దానిని సారవంతం చేస్తుంది. బేకింగ్ సోడా, యాంటీ ఫంగల్ లక్షణాలు మొక్కను హానికరమైన శిలీంధ్రాలు, సూక్ష్మక్రిముల నుండి రక్షిస్తాయి. ఈ రెండింటినీ ఉపయోగించడం వల్ల మనీ ప్లాంట్ మూలాలు బలపడతాయి. దాని ఆరోగ్యకరమైన రూపాన్ని తిరిగి వచ్చేలా చేస్తాయి.
మీ మనీ ప్లాంట్ మొక్క పచ్చదనం, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మరో ప్రభావవంతమైన పద్ధతి కూడా ఉంది. దీనికోసం ముందుగా చెట్టు మొదట గాలి బాగా తగిలేలా, మొక్క చుట్టూ ఉన్న మట్టిని పూర్తిగా వదులు చేయండి. తరువాత, ఒక చిటికెడు మెత్తని బూడిదను తీసుకొని దానికి సమానమైన బేకింగ్ సోడాను కలపండి. ఈ మిశ్రమాన్ని మొక్క వేర్ల దగ్గర ఉన్న మట్టిలో పోసి తేలికగా నీటితో పిచికారీ చేయండి. మీరు వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే.. మీ మొక్క త్వరలో మళ్ళీ వికసిస్తుంది. పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే, మీ మనీ ప్లాంట్ పచ్చగా ఉండాలంటే, ప్రతిరోజూ తీవ్రమైన సూర్యకాంతి అవసరం లేదు. కానీ, తేలికపాటి సూర్యకాంతి తగిలితే అది బాగా పెరుగుతుంది. తగినంత సూర్యకాంతి పడే ప్రదేశంలో మనీ ప్లాంట్‌ను ఉంచడం ఉత్తమం. మంచు, చల్లని గాలుల నుండి మొక్కను రక్షించడం కూడా ముఖ్యం. నీళ్ల విషయానికి వస్తే, నేల పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే మొక్కకు తేలికగా నీరు పెట్టండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, శీతాకాలంలో మొక్కను కత్తిరించకుండా ఉండటం మంచిది. అంటే చనిపోయిన కొమ్మలు, ఆకులను తొలగించడం వంటివి చేయకూడదు.
