AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. మీరు చేసే తప్పులతో ఈ సమస్యలు ఖాయం..

మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. భోజనం చేసిన వెంటనే హాయిగా గ్లాసుడు నీళ్లు తాగుతున్నారా.. అయితే మీరు తెలియకుండానే మీ జీర్ణవ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నారు. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలిగే అనర్థాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు.

తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. మీరు చేసే తప్పులతో ఈ సమస్యలు ఖాయం..
Drinking Water After Meals
Krishna S
|

Updated on: Jan 09, 2026 | 7:45 AM

Share

నీళ్లే కదా.. ఎప్పుడు తాగితే ఏముంది అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో, దానిని సరైన సమయంలో తాగడం కూడా అంతకంటే ముఖ్యం. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే గటగటా నీళ్లు తాగే అలవాటు మీకు ఉంటే అది మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఆహారం తిన్నప్పుడు, దానిని జీర్ణం చేయడానికి మన కడుపులో కొన్ని రకాల జీర్ణ రసాలు, యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఈ రసాలు పలుచబడి, వాటి శక్తిని కోల్పోతాయి.

ఈ అలవాటుతో కలిగే నష్టాలు ఇవే..

జీర్ణక్రియ మందగించడం: ఆహారం త్వరగా అరగదు. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

బరువు పెరగడం: ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు, అది కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతుంది. ఇది జీవక్రియను నెమ్మదింపజేసి ఊబకాయానికి దారితీస్తుంది.

పోషకాల లోపం: జీర్ణక్రియ సజావుగా సాగకపోతే, మనం తిన్న ఆహారంలోని విటమిన్లు, మినరల్స్‌ను శరీరం పూర్తిగా గ్రహించలేదు.

కడుపులో అసౌకర్యం: భోజనం తర్వాత వెంటనే నీరు తాగితే కడుపులో ఉష్ణోగ్రత తగ్గి, ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండిపోతుంది. దీనివల్ల కడుపు భారంగా అనిపిస్తుంది.

సరైన సమయం ఏది..?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. కాబట్టి భోజనం చేశాక 5 నుంచి 60 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. మీకు నీళ్లు తాగాలనిపిస్తే, భోజనానికి అరగంట ముందే తాగడం ఉత్తమం. దీనివల్ల శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది.

సరైన పద్ధతిలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలు

  • బరువు అదుపులో ఉంటుంది, ఊబకాయం దరిచేరదు.
  • గ్యాస్, అసిడిటీ సమస్యలు శాశ్వతంగా తగ్గుతాయి.
  • జీర్ణక్రియ మెరుగుపడి కడుపు తేలికగా ఉంటుంది.
  • శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
  • రాత్రి వేళల్లో నిద్ర నాణ్యత పెరుగుతుంది.

కేవలం నీరు తాగే సమయాన్ని మార్చుకోవడం ద్వారా మీరు అనేక అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు. కాబట్టి, ఈ రోజు నుండే భోజనం తర్వాత వెంటనే నీరు తాగే అలవాటును మానుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.