AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖంపై మొటిమలు నల్లమచ్చలతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం!

అందంగా ఉండాలని ఎవరు అనుకోరు చెప్పండి. చాలా మంది, అందంగా, ముఖం నిగారింపుగా, ఎలాంటి మచ్చలు మొటిమలు లేకుండా ఉండాలి అనుకుంటారు. కానీ తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా కొన్నిసార్లు ముఖంపై మొటిమలు నల్లమచ్చలు వచ్చేస్తుంటాయి. దీంతో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదర్కొంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.

Samatha J
|

Updated on: Jan 10, 2026 | 1:33 PM

Share
ముఖంపై మచ్చలు, నల్లమచ్చలు, మొటిమలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలిగించుకోవడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులను మార్కెట్లో కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ కొన్ని సార్లు వాటి వలన కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎప్పుటిలాగే ముఖంపై మచ్చలు ఉంటాయి. అయితే అలాంటి వారికే ఈ సహజమైన చిట్కాలు. ఎలాంటి ఖరీదైన ప్రొడక్ట్స్ ఉపయోగించుకోకుండా సింపుల్‌గా మచ్చలను నయం చేసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5
పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది శోథ నిరోధక లక్షణాలను కలగిఉంటుంది. అందువలన మొటిమలను నల్లమచ్చలను తొలిగించడంలో చక్కగా పని చేస్తుంది. మీరు మీ ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు ఎక్కువగా ఉన్నట్లు అయితే, పసుపు, శనగపిండి, పాలు, కలబంద కలిపి రోజూ సాయంత్రం సమయంలో ఫేస్‌కు అప్లై చేయాలి. దీని వలన చర్మం పై బ్యాక్టీరియా నశించి, నల్లమచ్చలు తగ్గుతాయి.

2 / 5
బంగాళ దుంప కూడా ముఖంపై మచ్చలను తొలిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీనికి మరకలను తొలిగించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మీరు బంగాళదుంప ముక్కలను నేరుగా మీ ముఖంపై రుద్దడం లేదా, బంగాళ దుంప రసంలో కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత శుభప్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన కూడా ముఖంపై మచ్చలు తొలిగిపోతాయంట.

3 / 5
ఎండిన నారింజ తొక్కలు కూడా నల్లమచ్చలను చాలా త్వరగా పొగొడుతాయి. నారింజ తొక్కలను ఎండ బెట్టి, వాటిని పౌడర్‌లా చేసి, అందులో పాలు కలిపి ముఖానికి పెట్టడం వలన ఇది ముఖంపై ఉన్న జిడ్డును, నల్లటి మచ్చలను తొలిగించేస్తుంది. ఎందుకంటే? నారింజ తొక్కల పౌడర్ ఎక్స్ ఫోలియేటర్‌గా పని చేసి, నల్లమచ్చలు తొలిగిపోయేలా చేస్తుందంట.

4 / 5
టమోటాలు, కాఫీ పౌడర్ కూడా నల్లమచ్చలకు అద్భతంగా పని చేస్తుంది. టమోటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన టమోటాను రెండుగా కట్ చేసి, దానిపై కొద్దిగా కాఫీ పౌడర్ చల్లి, దానితో ముఖానికి మసాజ్ చేసుకోవడం వలన ఇది నల్లమచ్చలను తొలిగించి, ముఖం ప్రశావంతంగా మెరిసేలా చేస్తుందంట.

5 / 5