AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిక్షాకు కూడా డబ్బులు లేని ఆ హీరో.. తర్వాత కోటీశ్వరుడయ్యాడు.. సంచలన విషయాలు చెప్పిన నటి

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు రాణించారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా చేసి ఆతర్వాత సహాయక పాత్రలో నటిస్తున్న వారిలో డబ్బింగ్ జానకి ఒకరు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు డబ్బింగ్ జానకి.. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు జానకి.

రిక్షాకు కూడా డబ్బులు లేని ఆ హీరో.. తర్వాత కోటీశ్వరుడయ్యాడు.. సంచలన విషయాలు చెప్పిన నటి
Dabbing Janaki
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2026 | 1:25 PM

Share

సీనియర్ నటి డబ్బింగ్ జానకి ఆమె గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు జానకి. అప్పటిలో హీరోయిన్ గాను రాణించారు జానకి. ఆతర్వాత ఆమె పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో మెప్పించారు. ఆతర్వాత ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు జానకి. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం జానకికి ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కేవలం ఏడో తరగతి వరకే చదువుకున్నప్పటికీ, జీవితంలో లౌక్యం కాకుండా బతకడం ఎలాగో నేర్చుకున్నానని ఆమె అన్నారు. తన జీవితంలో నటన స్టేజ్, స్క్రీన్‌కు మాత్రమే పరిమితం అని, నిజ జీవితంలో తాను ఫ్రాంక్‌గా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని తెలిపారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం గానీ, వినడం గానీ తనకు ఇష్టం లేదని జానకి అన్నారు.

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

సినీ పరిశ్రమలో ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకుండానే వెయ్యికి పైగా చిత్రాలలో నటించారు జానకి. సంపాదించిన డబ్బును చెన్నైలో అప్పట్లో తక్కువ ధరలకు లభించిన స్థలాల్లో పెట్టుబడులు పెట్టి, మంచి ఆర్థిక భవిష్యత్తును ఏర్పరచుకున్నానని ఆమె అన్నారు. తనకు దేవుడు తినగలిగే, నలుగురికి పెట్టగలిగే శక్తిని ఇస్తే చాలని తాను ఎప్పుడూ కోరుకునేదాన్నని అన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చి కష్టాల్లో ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులకు, తినడానికి తిండి లేక పార్కులలో పడుకున్న వారికి ఆశ్రయం కల్పించి, అన్నం పెట్టా అని తెలిపారు జానకి.  ఈ దాతృత్వం వల్ల తన చివరి రోజుల్లో తన పిల్లలకు పెద్దగా ఆస్తులు మిగల్చలేకపోయానని ఆమె ఎమోషనల్ అయ్యారు. తాను సహాయం చేసిన వారిలో చాలా మంది తమ పట్ల కృతజ్ఞతను కలిగి ఉంటారని అన్నారు.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

నటుడు చంద్రమోహన్ గారితో తన అనుబంధాన్ని జానకి వివరించారు. ఒకానొక సమయంలో సొంత ఇల్లు లేకపోవడంతో తాను చంద్రమోహన్ గారి లక్ష్మీ కాలనీలో ఉన్న ఇంట్లో అద్దెకు ఉన్నానని తెలిపారు. ఆ ఇంట్లో ఉండగానే తాను స్థలం కొనుక్కొని, విరుగంబాక్కంలో ఇల్లు కట్టుకొని మారానని, చంద్రమోహన్ గారు తనకు లక్కీ హ్యాండ్ అని ఆమె పేర్కొన్నారు. శోభన్ బాబు గారు కూడా ఏదైనా కొనేటప్పుడు ముందుగా చంద్రమోహన్ గారి చేతితోనే డబ్బులు ఇప్పిస్తారని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు జానకి. చంద్రమోహన్ గారిని తాను ఎంతగానో అభిమానిస్తానని, ఆయన మనసులో కల్మషాలు లేకుండా, ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తి అనిఅన్నారు జానకి.  శోభన్ బాబుతో కలిసి ఒక నాటకంలో నటించా.. . అప్పుడు ఆయన ఎంత పేదరికంలో ఉండేవారంటే, నాటక రిహార్సల్స్‌కు వెళ్ళడానికి రిక్షాకు పావలా కూడా చెల్లించలేని స్థితిలో ఉండేవారని అన్నారు. అలాంటి పరిస్థితుల నుండి శోభన్ బాబు గారు నేడు సౌత్ ఇండియాలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా, సగం చెన్నై ఆయనదే అన్నంత స్థాయికి ఎదిగారని ఆమె అన్నారు.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.