నా దెబ్బకు కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పాలనుకున్నారు: జయమాలిని
జయమాలిని చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన అందచందాలతో అప్పట్లో కుర్రకారును ఓ ఊపుఊపేసింది. అనతికాలంలో తెలుగు సినీ చరిత్రలో అక్కాచెల్లెళ్ళైన జ్యోతిలక్ష్మీ, జయమాలినిలు హవా కొన్ని దశాబ్ధాలపాటు కొనసాగింది. అప్పట్లో ఓ ఊపుఊపేశారు ఈ ఇద్దరూ.. గతకొంతకాలంగా జయమాలిని సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే హీరోయిన్స్ కూడా వెనకడుగు వేయకుండా చేసి అలరిస్తున్నారు. కానీ ఒకప్పుడు కేవలం స్పెషల్ సాంగ్స్ కోసమే కొందరు హీరోయిన్స్ ఉండే వారు. వారి సాంగ్స్ సినిమాలో ఉంటే ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. హీరో, హీరోయిన్స్ తో సమానంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు కొందరు నటీమణులు.. వారిలో సీనియర్ నటి జయమాలిని ఒకరు. అప్పటికే ఎక్కువగా వినిపించిన పేరులు జయమాలిని ఆమె అక్క జ్యోతిలక్ష్మి. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న జయమాలిని గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తన అక్క జ్యోతిలక్ష్మితో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. జ్యోతిలక్ష్మితో తనకు ఎటువంటి పోటీ లేదని, తామిద్దరం ఎల్లప్పుడూ అక్కాచెల్లెళ్లలనే ఉన్నాం అని అన్నారు. పరిశ్రమలో తామిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, సెట్‌లో మాట్లాడుకోరని ప్రచారంలో ఉన్న వార్తలను జయమాలిని ఖండించారు. చిన్నతనంలో తన తల్లి జ్యోతిలక్ష్మిని తనకు దూరంగా పెంచడానికి గల కారణాలను కూడా ఆమె వివరించారు. తమ మేనత్త, జ్యోతిలక్ష్మిని పెంచినట్లు తెలిపారు. డాన్సర్లుగా విజయలలిత, హలం వంటి వారితో పాటు అనురాధ, డిస్కో శాంతి, సిల్క్ స్మిత వంటి వారి గురించి ప్రస్తావించారు జయమాలిని. సిల్క్ స్మిత తాను వచ్చిన తర్వాతనే ఇండస్ట్రీలోకి వచ్చిందని, ఆమె తన పెళ్లికి వచ్చి బొకే ఇచ్చి వెళ్ళిందని జయమాలిని గుర్తుచేసుకున్నారు. ఒక తమిళ సినిమాలో ముగ్గురు హీరోయిన్లుగా నటించినప్పుడు, చివరకు సిల్క్ స్మితను అందంగా చూపించినా, దాన్ని తాము పోటీగా తీసుకోలేదని అన్నారు.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ, గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి, హరినాథ్ వంటి వారితో కలిసి పనిచేసిన తన అనుభవాలను జయమాలిని పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో, రెండు మూడు విజయవంతమైన చిత్రాల తర్వాత తనను చూసి ఇతర నటీమణులు పరిశ్రమకు గుడ్‌బై చెప్పాలని భావించారని వస్తున్న వార్తలను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని జయమాలిని స్పష్టం చేశారు. తాను బయటి విషయాలపై దృష్టి పెట్టనని, షూటింగ్‌కు వెళ్లినప్పుడు మాస్టర్‌ను చూసి, ఒకే షాట్‌లో, ఒకే టేక్‌లో పని పూర్తి కావాలని దైవాన్ని వేడుకునే దానిని అన్నారు. మైక్ అంటే భయం ఉన్న తనకు గత ఐదు సంవత్సరాలుగా మాత్రమే మాట్లాడటం అలవాటయ్యిందని ఆమె తెలిపారు.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
జ్యోతిలక్ష్మి, జయమాలినిల డాన్స్ శైలిలో కొంత వ్యత్యాసం ఉందని, అయితే తామిద్దరం ఒకే తల్లి బిడ్డలు కాబట్టి ఆ శక్తి ఒకేలా ఉంటుందని ఆమె అన్నారు. అప్పట్లో నటులకు ఆర్థిక విషయాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదని, తన తల్లి తన సంపాదనతో తన సోదరీమణుల పెళ్లిళ్లు చేసిందని, డబ్బు ఎంత ఖర్చయ్యిందో తనకు తెలియదని జయమాలిని తెలిపారు. శ్రీదేవి, భానుప్రియ వంటి నటీమణులకు కూడా వారి తల్లులే ఆర్థిక విషయాలను చూసుకునే వారని ఆమె ప్రస్తావించారు. ప్రస్తుతం నటీమణులు తమ ఆర్థిక విషయాలపై మరింత అవగాహనతో ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పట్లో పరిశ్రమలో టి.ఆర్. రాజకుమారి, సావిత్రి వంటి ప్రముఖులు తమ సంపాదనను ఎలా కోల్పోయారో జయమాలిని అన్నారు.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
