AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish: చేపలు తినేటప్పుడు పొరపాటున ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

మాంసాహార ప్రియులకు సండే వచ్చిందంటే చాలు.. నోరూరించే వంటకాలతో పండగే. ముఖ్యంగా చేపల కూర అంటే ఇష్టపడని వారుండరు. తీర ప్రాంతాల్లో ఉండేవారికి ఇది నిత్యం దొరికే అమృతం. చేపలు కేవలం రుచికరమైనవే కాదు.. పోషకాల గని కూడా. అయితే చేపలు తినే విషయంలో మన పెద్దలు చెప్పే కొన్ని జాగ్రత్తలు, అలాగే మనం వదిలేసే చేప తలలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Krishna S
|

Updated on: Jan 11, 2026 | 10:12 AM

Share
చేపల్లో విటమిన్ ఎ, డి లతో పాటు పాస్పరస్, రోటీన్, మెగ్నీషియం, సెలీనియం, అయోడిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు, వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
ఇందులోని పోషకాలు వ్యాధులతో పోరాడే శక్తినిస్తాయి. విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలంగా మారుస్తాయి. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా చేపలను సురక్షితంగా తీసుకోవచ్చు.

చేపల్లో విటమిన్ ఎ, డి లతో పాటు పాస్పరస్, రోటీన్, మెగ్నీషియం, సెలీనియం, అయోడిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు, వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు వ్యాధులతో పోరాడే శక్తినిస్తాయి. విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలంగా మారుస్తాయి. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా చేపలను సురక్షితంగా తీసుకోవచ్చు.

1 / 5
చాలా మంది చేపల వేపుడుతో పెరుగు అన్నం తినడానికి ఇష్టపడతారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. చేపలు, పాలు, పెరుగు అనేవి పరస్పర విరుద్ధమైన ఆహారాలు. చేపలు, పెరుగు రెండూ కూడా ప్రోటీన్ యొక్క గొప్ప వనరులు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియపై భారం పడుతుంది. దీనివల్ల గ్యాస్, అసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే రోజూ వ్యాయామం చేసేవారికి, జీర్ణశక్తి మెరుగ్గా ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు. అయినప్పటికీ జాగ్రత్త వహించడం ఉత్తమం.

2 / 5
చాలా మంది చేపను తింటారు కానీ తల భాగాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ నిజానికి అసలైన పోషకాలు అక్కడే ఉన్నాయి. ఇందులోని పోషకాలు రక్త ధమనులలో అడ్డంకులను తొలగించి, రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

3 / 5
నేటి ఆధునిక జీవనశైలి వల్ల చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. చేప తల తినడం వల్ల కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చేప తలలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి.

4 / 5
ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని సరైన పద్ధతిలో తీసుకోవడం ముఖ్యం. ఈ సారి చేపలు వండుకున్నప్పుడు ఆ తల భాగాన్ని పక్కన పడేయకండి.. ఎందుకంటే అది మీ గుండెకు, కిడ్నీలకు మేలు చేసే సంజీవని వంటిది.

5 / 5