AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ 5 ఫుడ్స్‌తో జాగ్రత్త.. పొరపాటున కూడా గుడ్లతో కలిపి తినకండి..! లేదంటే మీ బాడీ షెడ్డుకే!

Foods to Avoid with Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే పోషకాహారాలలో గుడ్లు కూడా ఒకటి. వీటిలో ఉండే నాణ్యమైన ప్రోటీన్, విటమిన్ డి, అమైనో ఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. రోజూ ఎగ్స్ తినడం వల్ల కండరాలు బలోపేతంతో పాటు బ్రెయిన్ కూడా యాక్టీవ్‌గా పనిచేస్తుంది. కానీ ఎగ్స్‌ పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది వాటి ప్రయోజనాలను పొందలేరు. అలాగే కొన్ని సార్లు ఇది ఆరోగ్యానికి హానికరం కూడా కావచ్చు. కాబట్టి ఎగ్స్‌ పాటు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jan 11, 2026 | 11:10 AM

Share
సోయామిల్క్: సోయా పాలు చాలా ఆరోగ్యకరమైనవి, కానీ వీటిని గుడ్లతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడవచ్చు. ఎందుకంటే గుడ్లలో, సోయా మిల్క్‌ రెండింటిలో నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. గుడ్లు, సోయా పాలను కలిపి తీసుకోవడం వల్ల కడుపులో ప్రోటీన్ శాతం పెరుగుతుంది. దీనివల్ల శరీరం రెండింటి నుండి పోషకాలను సరిగ్గా గ్రహించలేదు.కాబట్టి మీరు ఎగ్స్‌ నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే రెండింటిని ఎప్పుడూ కలిపి తీసుకోకండి

1 / 5
చక్కెర: గుడ్లతో పాటు స్వీట్లు లేదా చక్కెర తీసుకోవడం కూడా హానికరం. గుడ్లలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, చక్కెర చాలా త్వరగా జీర్ణమవుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు గుడ్లు తీసుకోవడం అంత హానికరం కాదు, కానీ స్వీట్లు, డెజర్ట్‌లు లేదా చక్కెర పానీయాలతో కలిపి గుడ్లను తీసుకోకపోవడం చాలా ప్రమాదం.

2 / 5
అరటిపండ్లు: గుడ్లు, అరటిపండ్లు రెండూ పోషకమైనవి, కానీ వాటిని కలిపి తినడం మానుకోవాలి. ఎందుకంటే వాటిని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గుడ్లు, అరటిపండ్లను వేర్వేరు సమయాల్లో తినడం మంచిది, ఉదాహరణకు అల్పాహారంతో పాటు గుడ్లు తినడం, రాత్రి భోజనం తర్వాత అరటిపండ్లు తినడం ఓకే. ఇది శరీరం రెండు పదార్థాలను సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి, పూర్తి పోషణను అందించడానికి అనుమతిస్తుంది.

3 / 5
టీ: చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్స్‌ తిన్న తర్వాత టీ తాగుతూ ఉంటారు. కానీ ఈ అలవాటు అనారోగ్యకరమైనది. టీలోని కొన్ని సమ్మేళనాలు మన శరీరం ప్రోటీన్ గ్రహించడాన్ని నిరోధిస్తాయి. ఇది గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకానికి దారితీస్తుంది. మీరు గుడ్లు, టీ రెండింటినీ తినాలనుకుంటే, వాటిని ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో తీసుకోవడం ఉత్తమం, వాటి మధ్య కనీసం 30 నుండి 60 నిమిషాల గ్యాప్ మెయింటేన్ చేయండి

4 / 5
మాంసం:  గుడ్లను మాంసంతో పాటు తినకూడదు. గుడ్లు, మాంసం రెండూ ప్రోటీన్, కొవ్వుతో సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటికి కలిపి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీని వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం, ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసం కాకుండా కూరగాయలు, తృణధాన్యాలు లేదా తేలికపాటి పండ్లతో గుడ్లు తీసుకోండి

5 / 5
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...

వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!

అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్

Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే

ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు

పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..

జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే

టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్

విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ