AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 4th Test: నాలుగో మ్యాచ్ డ్రా అయితే పరిస్థితేంటి..? టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ సాధ్యమేనా..?

నాలుగో టెస్టు ఫలితం రావాలంటే.. ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు వెంటవెంటనే ఆసీస్ ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాలి. అదే జరిగితే అందరూ కోరుకుంటున్నట్లుగానే

IND vs AUS 4th Test: నాలుగో మ్యాచ్ డ్రా అయితే పరిస్థితేంటి..? టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ సాధ్యమేనా..?
Wtc Final Scenario Between Sri Lanka And Team India
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 12, 2023 | 9:01 PM

Share

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టుకు నేటితో నాలుగో రోజు పూర్తయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 91 పరుగుల అధిక్యంతో భారత్ ఆలౌట్ అయింది. మరోవైపు ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను కూడా ఈ రోజే ప్రారంభించి మొదటి దశలోనే ఉంది. ఈ క్రమంలో నాలుగో టెస్టు ఫలితం రావాలంటే.. ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు వెంటవెంటనే ఆసీస్ ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాలి. అదే జరిగితే అందరూ కోరుకుంటున్నట్లుగానే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా చేరుతుంది. అయితే అసలు ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా..? లేదా..? ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు ఇదే చర్చ. పరిస్థితులు చూస్తుంటే అసాధ్యమే అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరుతుందా..? ఇదే ఇప్పుడు అందరి మతిని తొలుస్తున్న ప్రశ్న. డ్రాగా ముగిస్తే పరిస్థితి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఓడినా కూడా సిరీస్‌ మన నుంచి చేజారదు. రేపటి మ్యాచ్‌ డ్రా అయినా కూడా సిరీస్‌ మనదే అవుతుంది. అయితే వరుసగా రెండోసారి కూడా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలంటే మాత్రం రేపటి మ్యాచ్‌లో భారత్‌కు విజయం అవసరం. గెలిస్తే.. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన ఆసీస్‌తోనే తలపడేందుకు సిద్ధమైపోవచ్చు. కానీ ఒకవేళ ఓడినా, మ్యాచ్‌ డ్రా అయినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న గందరగోళానికి తెరపడాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే భారత్-ఆసీస్‌ నాలుగో టెస్టుతోపాటు న్యూజిలాండ్ – శ్రీలంక తొలి టెస్టు కూడా ఒకే రోజు మొదలై.. చివరి రోజు వరకు చేరుకున్నాయి.

ఇవి కూడా చదవండి

డబ్య్లూటీసీ ఫైనల్ చేరేందుకు భారత్ ఎదుట ఉన్న మార్గాలివే..

  • అహ్మదాబాద్ వేదిక జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ విజయం సాధిస్తే.. టెస్టు సిరీస్‌ సొంతం చేసుకోవడంతో పాటు WTC ఫైనల్‌కు టీమిండియా నేరుగా చేరుతుంది. అప్పుడు న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్‌ విజయం సాధించినా భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  • నాలుగో టెస్టులో ఓడినా భారత్‌కు ఫైనల్‌ అవకాశం ఉంటుంది. అదెలా అంటే..న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఒక్క టెస్టు ఓడినా చాలు. అలాగే న్యూజిలాండ్శ్రీ-లంక సిరీస్‌ డ్రా అయినా కూడా భారత్‌ మార్గం సుగమం అయినట్లే. రెండు టెస్టులూ డ్రా అయినా మనకే లాభం.
  • భారత్‌, ఆసీస్‌ నాలుగో టెస్టు జరుగుతున్న తీరును చూస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడం కష్టమే. కానీ మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. అంటే సిరీస్‌ 2-1తో ముగుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో లంక కచ్చితంగా ఓ టెస్టులో ఓడిపోవాలి. తొలి టెస్టులోనే కివీస్‌ గెలిచేస్తే రెండో టెస్టు ఫలితం వరకు WTC ఫైనల్ బెర్తు కోసం ఆధారపడి ఉండనవసరం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..