Virat Kohli: 40 ఏళ్ల క్రితం సీన్ రిపీట్.. మైలురాయి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ.. టీమిండియా చరిత్రలో రెండో క్రికెటర్‌..

స్వదేశంలో విరాట్ కోహ్లీకి ఇది 50వ టెస్టు. ఈ మైలురాయి మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా కింగ్ కోహ్లీ.. 40 ఏళ్ల క్రితం జరగిన సీన్‌ను రిపీట్ చేశాడు. అదెలా అంటే...

Virat Kohli: 40 ఏళ్ల క్రితం సీన్ రిపీట్.. మైలురాయి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ.. టీమిండియా చరిత్రలో రెండో క్రికెటర్‌..
Virat Kohli And Sunil Gavaskar
Follow us

|

Updated on: Mar 12, 2023 | 7:17 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ బాదాడు. ఈ సెంచరీతో సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు చేసిన 2వ బ్యాట్స్‌మెన్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. చివరిసారిగా 2019(నవంబర్ 22) బంగ్లాదేశ్‌పై టెస్టు సెంచరీ సాధించిన కింగ్ కోహ్లి.. 1205 రోజుల తర్వాత మళ్లీ సెంచరీ చేశాడు. అయితే తన కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిన ప్రత్యేక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషమని చెప్పుకోవాలి. అవును, స్వదేశంలో విరాట్ కోహ్లీకి ఇది 50వ టెస్టు. ఈ మైలురాయి మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా కింగ్ కోహ్లీ.. సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 40 ఏళ్ల రికార్డును సమం చేశాడు.

40 ఏళ్ల క్రితం అంటే 1983లో భారత్‌లో తన 50వ టెస్టు ఆడిన సునీల్ గవాస్కర్.. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అలాగే స్వదేశంలో ఆడిన 50వ మ్యాచ్‌లో సెంచరీ సాధించి గవాస్కర్ ప్రత్యేక రికార్డును సృష్టించాడు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాపై భారీ సెంచరీ చేసిన కోహ్లీ కూడా ఆ ఘనత సాధించిన 2వ టీమిండియా క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. దీంతో 40 ఏళ్ల క్రితం సునీల్ గవాస్కర్ రాసిన చరిత్రను విరాట్ కోహ్లీ పునరావృతం చేశాడు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 571-10 వద్ద ముగించింది. దీంతో అంతకముందు 480-10 పరుగులు చేసిన ఆసీస్ జట్టుపై టీమిండియా 91 పరుగుల అధిక్యంలో ఉన్నట్లయింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ కోసం క్రీజులోకి వచ్చిన ఆసీస్ బ్యాటర్లు 6 ఓవర్లలో 3 పరుగులు చేసి నాలుగో రోజు ఆట ముగించారు. ప్రస్తుతం క్రీజులో ట్రావీస్ హెడ్(18 బంతుల్లో 3 పరుగులు), మాథ్యూ కున్హెమాన్(18 బంతుల్లో 0 పరుగులు) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?