IND vs AUS: సెంచరీ తర్వాత కోహ్లీ ముద్దాడుతున్న ఈ లాకెట్ స్పెషాలిటీ ఎంటో తెలుసా? ఇంతకీ అందులో ఏముందంటే?
అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ సంబరాలు చూశారా ? మూడంకెల స్కోరుకు చేరుకోగానే తన మెడలోని లాకెట్ తీసి ముద్దులు పెడుతూ కనిపించాడు కోహ్లీ. ఇప్పుడే కాదు ఇటీవల సెంచరీ కొట్టినప్పుడల్లా ఇదే విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు మన రన్ మెషిన్.
అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ సంబరాలు చూశారా ? మూడంకెల స్కోరుకు చేరుకోగానే తన మెడలోని లాకెట్ తీసి ముద్దులు పెడుతూ కనిపించాడు కోహ్లీ. ఇప్పుడే కాదు ఇటీవల సెంచరీ కొట్టినప్పుడల్లా ఇదే విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు మన రన్ మెషిన్. మరి విరాట్ కోహ్లీ లాకెట్ స్పెషాలిటీ ఏంటీ? అందులో ఏముంది? ఆ లాకెట్‌ని ముద్దుపెట్టుకుని సెంచరీ జరుపుకోవడం వెనక కారణేమేంటోనని అభిమానులు ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్‌లో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో సెంచరీ కోసం 1205 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇది అతని అంతర్జాతీయ కెరీర్‌లో 75వ సెంచరీ కాగా, అతని టెస్టు కెరీర్‌లో 28వ సెంచరీ. చాలా గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లో ఈ సెంచరీ రాగా, కోహ్లీ మళ్లీ తన లాకెట్‌ను ముద్దాడాడు. ఇంతకుముందు 2018లో దక్షిణాఫ్రికాపై సెంచూరియన్‌లో 153 పరుగులు చేసినపుడు ఇలా మొదటిసారిగా లాకెట్‌ను ముద్దుపెట్టుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. 7 నెలల తర్వాత, విరాట్ కోహ్లీ జూలై 2018లో ఇంగ్లాండ్‌లో తన టెస్ట్ కెరీర్‌లో 22వ సెంచరీని సాధించాడు. అప్పుడు కూడా ఇలాగే సంబరాలు జరుపుకున్నాడు.
ఇక గడ్డుపరిస్థితులను దాటి గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై తొలి టీ20 సెంచరీ చేసినపుడు కూడా లాకెట్‌ను ముద్దాడాడు. అయితే విరాట్ ఇలా లాకెట్‌ను ముద్దాడడం వెనక ఓ ప్రత్యేక కారణముంది. ఇది నిజానికి లాకెట్ కాదు అతని పెళ్లి ఉంగరం. తన సతీమణి అనుష్కా శర్మపై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అందుకే సెంచరీ చేసినప్పుడల్లా తన సతీమణిని గుర్తుతెచ్చుకుంటూ ఈ లాకెట్‌ను ముద్దుపెట్టుకుంటాడట కోహ్లీ. కాగా ఈ వరుస సెంచరీల ముందుకు కోహ్లీ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు ఫామ్‌లేమితో తంటాలు పడ్డాడు. కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్కనే తనకు అండగా నిలిచిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
•In 2018 – After fails in 2014 England tour, he made a incredible comeback.
•In 2023 – After 1205 days, he made a incredible comeback.
The Incredible comebacks of Virat Kohli in Test Cricket and same celebrations after reaching Hundred – The King.!! pic.twitter.com/3VdJ98wBGX
— CricketMAN2 (@ImTanujSingh) March 12, 2023
The milestone we’d all been waiting for and here it is!
71st International Century for @imVkohli ??#AsiaCup2022 #INDvAFGpic.twitter.com/hnjA953zg9
— BCCI (@BCCI) September 8, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..